పార్లమెంట్ ఎన్నికలకు హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాట్లు పూర్తయ్యాయని జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ వెల్లడించారు. ఈ ఎన్నికల నిర్వహణకు ప్రత్యక్షంగా, పరోక్షంగా 35 వేల మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 41 లక్షల 77 వేల 703 మంది ఓటర్లు ఉన్నారని ఇందులో 94 శాతం ఓటర్ స్లిప్పులు పంచినట్లు చెప్పారు.
పోలింగ్ కేంద్రాల వద్ధ కనీస సౌకర్యాల ఏర్పాటు
మొత్తం 3 వేల 976 పోలింగ్ కేంద్రాల్లో 4 వేల 378 మంది ప్రిసైడింగ్ అధికారులు విధులు నిర్వహించనున్నారు. వేయి పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయగా...మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో స్టాటిక్ కెమెరాల ద్వారా రికార్డింగ్ చేస్తారు. మొత్తం 17 వేల 581 మందికి పోస్టల్ బ్యాలెట్లు పంపిణీ చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగు నీరు, శౌచాలయాలు, స్వచ్ఛంద సంస్థలచే మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ, ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మోడల్ పోలింగ్ స్టేషన్, ఒక మహిళా పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు దానకిషోర్ తెలిపారు. దివ్యాంగ ఓటర్లకు సహాయంగా 2వేల మంది వాలంటీర్లు, ప్రత్యేకంగా 145 వాహనాలు, 1388 వీల్ఛైర్లను ఏర్పాటు చేశామని తెలిపారు.
బైట్ః దానకిషోర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి
సెలవు ప్రకటించని సంస్థలపై చర్యలు
ఎన్నికల రోజు ప్రతీ సంస్థ వేతనంతో కూడిన సెలవు ప్రకటించాల్సిందేని, నిబంధనలకు విరుదర్ధంగా నడిపించే సంస్థలపై తగు చర్యలు ఉంటాయని దానకిషోర్ హెచ్చరించారు.
బైట్ః దానకిషోర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి
అదనపు పోలింగ్ కేంద్రాలకు ఈసీ తిరస్కారం
హైదరాబాద్ జిల్లాలో అదనంగా మూడు అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సమర్పించిన ప్రతిపాదనలను ఈసీ తిరస్కరించిందని దానకిషోర్ తెలిపారు. 1500 ఓట్లు మించిన పోలింగ్ కేంద్రాలకు అదనంగా కేంద్రాలను ఏర్పాటు చేయాలని అనుమతి కోరగా కేంద్ర ఎన్నికల సంఘం నిరాకరించిందని తెలిపారు. మలక్‌పేట్ అసెంబ్లీ సెగ్మెంట్లో రెండు పోలింగ్ కేంద్రాలు, సికింద్రాబాద్ పరిధిలో ఆరు పోలింగ్ కేంద్రాల పేర్లను మార్చే ప్రతిపాదనలను ఈసీఐ ఆమోదించిందని తెలిపారు. వీటితో పాటు కార్వాన్ అసెంబ్లీ సెగ్మెంట్లో నాలుగు పోలింగ్ కేంద్రాల స్థానాలను మార్చే ప్రతిపాదనలపై ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని దానకిషోర్ వెల్లడించారు.
భాగ్యనగరంలో పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం
హైదరాబాద్‌లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నేడు డీఆర్సీ కేంద్రాల్లో సిబ్బందికి విధులు కేటాయించనున్నారు. ఇప్పటికే 94 శాతం ఓటరు స్లిప్పులు పంపిణీ చేసినట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. పోలింగ్ రోజు సెలవు ఇవ్వని ప్రైవేటు సంస్థలపై కఠిన చర్యలుంటాయని తెలిపింది మహానగర పాలక సంస్థ.
ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం
ఇవీ చూడండి: 'ప్రచార పర్వం పూర్తి... పోలింగ్‌కు ఏర్పాట్లు'