లాక్డౌన్ కారణంగా వృద్ధాశ్రమల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ కుషాయిగూడ హౌసింగ్ బోర్డులోని మెన్స్ ఎల్డర్స్ కేర్ హోమ్స్ కేర్లో 40 మంది వృద్ధులు ఉన్నారు. వృద్ధుల బంధువులు కూడా వారిని చూడటానికి రాకపోవడం వల్ల వారు ఇబ్బందులు పడుతున్నారని నిర్వహకులు చెబుతున్నారు.
మావోళ్లు వదిలేశారు.. సాయం చేయండి సారూ - old Age home problems in hyderabad
లాక్డౌన్ కారణంగా వృద్ధాశ్రమాల్లో ఉన్న వారు అక్కడే చిక్కుకుపోయారు. అయితే వారి నిర్వహణ ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టంగా ఉందని నిర్వహకులు చెబుతున్నారు. తల్లిదండ్రుల పిల్లలు సైతం పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. దాతలు ముందుకొచ్చి సాయం చేయాలని కోరుతున్నారు.
![మావోళ్లు వదిలేశారు.. సాయం చేయండి సారూ elderly people help me out at kushaiguda old Age home](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7210640-441-7210640-1589542902078.jpg)
మావోళ్లు వదిలేశారు.. సాయం చేయండి సారూ
వారి పోషణ ఖర్చు రోజురోజుకూ పెరిగిపోతుందంటున్నారు. దగ్గరలో ఉన్న పోలీసులు కొన్నిసార్లు నిత్యావసరాలు ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం కూడా వృద్ధాశ్రమాలకు చేయూత అందిస్తే, వారి ఆకలి బాధలు తీరుతాయన్నారు. కరోనా వైరస్ కారణంగా వృద్ధాశ్రమలకు ఎవ్వరూ కూడా రావడంలేదన్నారు. కనీసం శానిటైజర్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
మావోళ్లు వదిలేశారు.. సాయం చేయండి సారూ
ఇదీ చూడండి :మీరు పన్ను కట్టాల్సిన రోజొకటి ఉంది జాగ్రత్త!