Elderly Couple Suicide due to Cancellation of Pension: ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా దక్షిణ అద్దంకి గొరకాయపాలెంలో కట్టా వెంకయ్య అలియాస్ ముసలయ్య (79), వెంకాయమ్మ (70) దంపతులు నివసిస్తున్నారు. వారు ఐదు దశాబ్దాల కిందటే ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరు మగ, ఒక ఆడ సంతానం. వారికి పెళ్లిళ్లు చేశారు. జీవిత చరమాంకంలో అనారోగ్యం వెంటాడింది. దీనికితోడు వృద్ధాప్య పింఛను రద్దయింది. తెలిసిన వారెవరైనా కనిపిస్తే ‘కాస్తంత పురుగు మందు ఇవ్వండి.. తాగి చనిపోతాం.. ఈ బాధలు భరించలేకపోతున్నాం’ అనేవారు. అన్నట్లుగానే దంపతులిద్దరూ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.
పింఛను రద్దు.. బతకలేమంటూ వృద్ధదంపతుల ఆత్మహత్య - elderly couple committed suicide
Elderly Couple Suicide due to Cancellation of Pension: ప్రేమ వివాహం చేసుకున్న వారు.. యాభై ఏళ్లకుపైగా కలిసి జీవించారు. కానీ జీవిత చరమాంకంలో అనారోగ్యానికి తోడు వృద్ధాప్య పింఛను రద్దయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా దక్షిణ అద్దంకి గొరకాయపాలెంలో ఉంటున్న ఈ దంపతులు.. ముసలయ్య, వెంకాయమ్మలు.. పురుగుల మందు తాగి చనిపోయారు.

వృద్ధ దంపతుల ఆత్మహత్య
వారి పిల్లలు వేరే ఇళ్లలో ఉంటూ తల్లిదండ్రులకు తోడుగా అదే ప్రాంతానికి చెందిన ఒకరిని ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి దంపతులిద్దరూ పురుగుమందు తాగి చనిపోయారు. సపర్యలు చేసేందుకు తెల్లవారుజామున వెళ్లిన వ్యక్తి గమనించి కుటుంబీకులకు తెలిపారు. ఇంటి చదరపు అడుగుల్లో తేడా, విద్యుత్తు బిల్లుల్లో హెచ్చు వంటి అంశాలతో వెంకయ్య పింఛను నిలిచిపోయింది. అప్పటి నుంచి ముభావంగా ఉంటున్న వెంకయ్య తన భార్యతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డారని కుటుంబీకులు తెలిపారు.
ఇవీ చదవండి: