తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజభవన్​లో ఘనంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్​ వేడుకలు

సంస్థానాలన్నింటినీ విలీనం చేసి భారత ఐక్యతకు కృషి చేసిన వ్యక్తి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ అన్నారు. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్​లో పటేల్​ చిత్రపటానికి గవర్నర్​ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో ఏక్తా దివాస్​ ప్రతిజ్ఞ చేయించారు.

ektha diwas celebrations in raj bhavan hyderabad
రాజభవన్​లో ఘనంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్​ వేడుకలు

By

Published : Oct 31, 2020, 5:43 PM IST

సంస్థానాలను విలీనం చేసి భారత ఐక్యతకు కృషి చేసిన వ్యక్తి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ అన్నారు. దేశానికి ఆయన ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. జాతీయ ఐక్యతా దినోత్సవం పురస్కరించుకొని రాజ్ భవన్ దర్బార్ హాల్​లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం రాజ్ భవన్ అధికారులు, సిబ్బందితో తమళిసై.. ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ చేయించారు. దేశ ఐక్యత, సమగ్రత, రక్షణకు పాటుపడతామని ప్రతిన పూనారు.

ఇదీ చదవండి:వరద సాయం కోసం ఉప్పల్​లో బాధితుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details