ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో 6,7 తరగతుల ప్రవేశ పరీక్ష కోసం ఈనెల 30 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 8 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి.
ఈనెల 30 నుంచి ఏకలవ్య గురుకుల ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ - Ekalavya Gurukul Entrance Examinations
ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్షల కోసం ఈనెల 30 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వివరాల కోసం గిరిజన గురుకుల సొసైటీ వెబ్ సైట్ www.tgtwgurukulam.telangana.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.
ఈనెల 30 నుంచి ఏకలవ్య గురుకుల ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ
ఆ పాఠశాలల్లో ఆరు, ఏడు తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎంట్రన్స్ కోసం ఈనెల 30 నుంచి అక్టోబరు 9 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబరు 25న ప్రవేశ పరీక్ష నిర్వహించననున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాల కోసం గిరిజన గురుకుల సొసైటీ వెబ్ సైట్ www.tgtwgurukulam.telangana.gov.in ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.
TAGGED:
తెలంగాణ తాజా వార్తలు