ఆర్టీసీ బస్సులు సమయానికి రావడం లేదంటూ ఓ విద్యార్థిని ఏకంగా సీజేఐ ఎన్వీ రమణ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన సీజేఐ ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం చిడేడు గ్రామానికి చెందిన వైష్ణవి 8వ తరగతి చదువుతోంది. తాను పాఠశాలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులు సరిగ్గా నడపడం లేదనే విషయాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసింది.
Student complaint: బస్సులు టైంకి రావడం లేదని ఆ విద్యార్థిని ఏకంగా... - సీజేఐ ఎన్వీ రమణ
సమయానికి ఆర్టీసీ బస్సులు రాకపోవడం వల్ల పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు, వివిధ పనులపై వెళ్లే ఎంతో మంది ఇబ్బందులు పడుతుంటారు. కానీ.. ఇదే సమస్య రోజూ ఎదురవుతుంటే.. సంబంధిత అధికారులు లేదా స్థానిక బస్టాండులో ఫిర్యాదు చేస్తాం. కానీ.. ఓ విద్యార్థిని మాత్రం ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లింది.
ఆర్టీసీ బస్సులు రావడం లేదని విద్యార్థిని ఫిర్యాదు
విద్యార్థిని అభ్యర్థనపై స్పందించిన సీజేఐ.. ఈ విషయాన్ని టీఎస్‌ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ బస్సులను తక్షణమే పునరుద్ధరించినట్లు వెల్లడించారు. బస్సుల పునరుద్ధరణపై అప్రమత్తం చేసినందుకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు సజ్జనార్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చూడండి: