తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2024, 11:07 AM IST

ETV Bharat / state

కొండెక్కిన కోడిగుడ్డు ధర - డజన్ ఎంతో తెలిస్తే షాక్

Eggs Price Hike in Telangana 2024 : రాష్ట్రంలో కోడిగుడ్డు ధర కొండెక్కింది. వారం రోజుల్లోనే డజను గుడ్ల ధర రూ.72 నుంచి రూ.84కు చేరుకుంది. చలి ప్రభావం కోళ్లపై పడటం, కార్తిక మాసం ముగియడంతో గుడ్ల ధరలు భారీగా పెరిగిపోయాయని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.

Current Egg Price in Telangana
Eggs Price Increased in Telangana

Eggs Price Increased in Telangana :ఈ మధ్యకాలంలో కోడిగుడ్ల విక్రయాలు చాలా పెరిగాయి. దానికి ఒక కారణం ప్రతిఒక్కరు ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడం. మరోవైపు కార్తిక మాసం ముగియడంతో గత రెండువారాలుగా గుడ్ల అమ్మకాలు మరింత పెరిగాయి. చలి తీవ్రత పెరగడంతో కోళ్లపై ప్రభావం పడి గుడ్ల ఉత్పత్తి తగ్గడం వల్ల రాష్ట్రంలో గుడ్ల ధర పెరిగింది. మరోవైపు చికెన్ రేటు కూడా దాదాపు రూ.50 పెరిగిపోయింది.

రాష్ట్రంలో కోడిగుడ్ల ధర భారీగా పెరిగింది. కార్తిక మాసం అయిపోవడతంతో, గుడ్ల వినియోగంతో పాటు ధరలు పెరుగుతున్నాయి. గత నెలల ఒక్కో గుడ్డు ధర రూ.5.50 ఉండగా, వారం క్రితం రూ.6కు చేరుకుంది. తాజాగా గుడ్డు ధర రూ.7కి పెరిగింది. కేవలం వారం రోజుల్లోనే డజను గుడ్ల ధర ఏకంగా రూ.72 నుంచి రూ.84కు చేరుకుంది. హోల్‌సేల్‌లో ఒక్క గుడ్డు ధరు రూ.5.76గా ఉంది. కోడిమాసం (చికెన్) ధర కూడా పెరిగింది. కార్తిక మాసంలో కిలో చికెన్ రూ.170 నుంచి రూ.190వరకు ఉంది. తాజాగా దాని ధర రూ.240కి చేరింది. రాష్ట్రంలో 1,110కోళ్ల ఫారాలున్నాయి. కోడిగుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉంది.

కొండెక్కుతున్న కోడిగుడ్డు ధర.. సామాన్యుడికి గుండె దడ!

Current Egg Price in Telangana :రాష్ట్రంలో సంవత్సరానికి 17.67 బిలియన్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే, గత 20 రోజులుగా చలి పెరగడంతో కోళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని దానివల్ల గుడ్ల ఉత్పత్తి బాగా తగ్గిందని పెంపకందారులు చెబుతున్నారు. మరోవైపు, దాణ ఛార్జీలు పెరగడం, వాహనాదారులు గత రెండు నెలల్లో రవాణా ఖర్చులు 15శాతం పెంచడం వల్ల గుడ్ల ధర పెరిగిందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. క్వింటాలు సోయచెక్క దాణా ధర సంవత్సరం క్రితం క్వింటాలుకు రూ.5వేలు ఉండగా, ప్రస్తుతం దాని ధర రూ.7200కు చేరింది. మొక్కజొన్న క్వింటాలుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు పెరిగిందని వ్యాపారులు చెప్పారు.

కోడిగుడ్డు రైతులకు గడ్డు కాలం.. పెరిగిన దాణా ఖర్చులతో మరింత నష్టం

హైదరాబాద్‌లో సాధారణంగా రోజుకు 80లక్షల కోడిగుడ్ల అమ్మకాలు జరుగుతాయి. గత నెలలో 90లక్షలు అమ్ముడుపోగా, వారం రోజుల నుంచి కోటికిపైగా విక్రయాలు జరిగాయి. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో కోడిగుడ్ల విక్రయాలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ధరలు ఇలాగే ఉంటే కోడిగుడ్డు తినడం గగనమైపోతుందని సామాన్యులు వాపోతున్నారు.

పెరుగుతున్న గుడ్డు వినియోగం.. కోలుకుంటున్న పౌల్ట్రీ పరిశ్రమలు

ఈ కోడిగుడ్డు మీ కళ్లను మోసం చేయటం ఖాయం.!

ABOUT THE AUTHOR

...view details