Agnipath effect: సైన్యంలో తాత్కాలిక నియామకాలకు సంబంధించి ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ విధానంపై ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లో ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైల్వేశాఖ వివిధ జోన్లలో ప్రయాణించే రైలు సర్వీసుల్లో మార్పులు చేసింది. కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయగా.. కొన్నింటిని తాత్కాలికంగా నిలిపివేసింది. మరికొన్ని రైళ్లను మార్గం మళ్లించింది. ఇప్పటివరకు ప్రభావితమైన మొత్తం రైళ్ల సంఖ్య 340గా ఉందని అధికారులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా 200 రైళ్లను రద్దు చేసింది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తాత్కాలికంగా రద్దు
* 12703 హౌరా- సికింద్రాబాద్ (మౌలాలీ - సికింద్రాబాద్ మధ్య)
* 17234 సిర్పూర్ కాగజ్‌నగర్ - సికింద్రాబాద్ (మౌలాలీ- సికింద్రాబాద్ మధ్య)
* 12747 గుంటూరు - వికారబాద్ (చర్లపల్లి -వికారబాద్ మధ్య)
* 17645 సికింద్రాబాద్ - రేపల్లె
రద్దు చేసిన రైళ్లు..
* 18046 హైదరాబాద్ - షాలిమర్
* 07078 అహ్మద్‌నగర్ - సికింద్రాబాద్
* 07055 సికింద్రాబాద్ - అహ్మద్ నగర్
* 07056 అహ్మద్ నగర్ - సికింద్రాబాద్
* 07059 సికింద్రాబాద్ - అహ్మద్ నగర్
* 07060 అహ్మద్‌నగర్ - సికింద్రాబాద్
మళ్లింపులు
* 17025 షిరిడి సాయి నగర్ - కాకినాడ పోర్టు (సనత్ నగర్, అమ్ముగూడా, చర్లపల్లి)
* 11020 భువనేశ్వర్ - ముంబయి సీఎస్‌టీ (చర్లపల్లి, అమ్ముగూడ, సనత్‌నగర్)
6 ఎంఎంటీస్ రైలు సర్వీసుల రద్దు
* లింగంపల్లి-హైదరాబాద్(8 సర్వీసులు)
* హైదరాబాద్-లింగంపల్లి(9 సర్వీసులు)
* ఫలక్‌నుమా-లింగంపల్లి (12 సర్వీసులు)
* లింగంపల్లి-ఫలక్‌నుమా (13సర్వీసులు)