ETV Bharat / state
ఆర్టీసీపై తీవ్రంగా పడిన కరోనా ప్రభావం - తెలంగాణ ఆర్టీసీ తాజా వార్తలు
రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత ఆర్టీసీలో ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటారనే అంశాలపై గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లుతో మా ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి.
ఆర్టీసీపై తీవ్రంగా పడిన కరోనా ప్రభావం
By
Published : Apr 25, 2020, 5:59 PM IST
| Updated : Apr 25, 2020, 7:00 PM IST
ఆర్టీసీపై తీవ్రంగా పడిన కరోనా ప్రభావం
ప్ర. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత బస్సులు తిరిగి ప్రారంభిస్తే ఏదైనా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఏర్పడుతుందా?
జ. బస్సులకు మరమ్మతులు చేయాల్సిన అవసరం లేదు. మళ్లీ యథావిధిగా ప్రారంభమౌతాయి.
ప్ర. లాక్‌డౌన్ సమయంలో నెలరోజులకు పైగా గ్రేటర్ పరిధిలో ఆర్టీసీకి ఎంతనష్టం వచ్చింది?
జ.గ్రేటర్ పరిధిలో రోజుకు సగటున రూ. 3 కోట్ల 60 లక్షల నష్టం
ప్ర. లాక్‌డౌన్ తర్వాత సీట్ల ఆరేంజ్మెంట్లో ఏదైనా మార్పులు చేస్తున్నారా?
జ. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన లేదు. లాక్‌డౌన్ తర్వాత కూడా బస్సులకు శానిటైజేషన్ చేస్తాం.
ప్ర. డ్రైవర్లు, కండక్టర్లు ఎలాంటి రక్షణలు పాటించనున్నారు?
జ. సిబ్బందికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాం. డ్రైవర్లు, కండక్టర్లు శానిటైజర్లు వాడుతూ విధులు నిర్వహిస్తారు.
ప్ర. టీఎస్ ఆర్టీసీ కార్గో బస్సులు నడుపుతున్నారు. వాటి నుంచి ఎంత ఆదాయం వచ్చింది?
జ. ఇప్పటివరకూ ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుతం ప్రభుత్వ అవసరాలకు నడుపుతున్నాం.
Last Updated : Apr 25, 2020, 7:00 PM IST