తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్రంలో పేదలందరికీ మెరుగైన వైద్యమే లక్ష్యం' - వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​

రాష్ట్రంలో ప్రతి పేదవాడికీ మెరుగైన వైద్యం అందేలా తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి సీఎం కేసీఆర్​ అనేక సంస్కరణలు అమలు చేశారని ప్రశంసించారు.

ఈటల రాజేందర్

By

Published : Jun 14, 2019, 7:48 PM IST

రాష్ట్రంలో పేదలందరికీ మెరుగైన వైద్యం అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్​ అనేక సంస్కరణలు అమలు చేశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి అధికారులతో సమావేశమైన ఆయన వర్షాకాలంలో అటవీ ప్రాంత ప్రజలకు జ్వరాల నుంచి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మొబైల్​ ఆస్పత్రులు, వైద్యులతో వైద్యం అందించాలని తెలిపారు. తెరాస పాలనలో బోధన ఆస్పత్రుల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 65 ఏళ్లకు పెంచామని గుర్తుచేశారు. హెల్త్​ కార్డులు, ఆరోగ్యశ్రీకి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించినట్లు వివరించారు.

ప్రతి పేదవాడికీ మెరుగైన వైద్యం అందిస్తామన్న ఈటల

ABOUT THE AUTHOR

...view details