Eetala meet Amitshah: హస్తినలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డితో కలిసి ఈటల అమిత్‌షాను కలిశారు. వీరిద్దరిని అమిత్ షానే పిలిపించుకొని మాట్లాడారు.తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని తమకు సూచించినట్లు ఇరువురు నేతలు తెలిపారు. అయితే ఈటలను హుటాహుటిన దిల్లీకి ఎందుకు పిలిచారు? కొత్తగా ఏమైనా బాధ్యతలు అప్పగించబోతున్నారా? కొత్తగా ప్రణాళిక ఏమైనా ఉందా? అనే రాష్ట్ర నేతల్లో చర్చ జరుగుతోంది.
Eetela meet Amitshah: 'దిల్లీలో అమిత్‌షాను కలిసిన ఈటల' - హైదరాబాద్ తాజా వార్తలు
Eetala meet Amitshah: తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న భాజపా నాయకత్వం ఆ దిశగా ఒక్కో అడుగు ముందుకెళ్తోంది. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యనేతలంతా తెలంగాణపై దృష్టిసారించారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను ప్రత్యేకంగా దిల్లీకి పిలిపించుకొని భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఈటల రాజేందర్