హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హెటల్లో సీఐఐ, ఐఎంటీహెచ్ సంయుక్తంగా హెల్త్ ఫార్మా సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఫార్మారంగంపై ఐఎంటీ రూపొందించిన నివేదికను మంత్రి ఆవిష్కరించారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే.. దక్షిణాది రాష్ట్రాలు ఫార్మా రంగంలో వేగంగా పురోగమిస్తున్నాయని తెలిపారు. ఫార్మా కంపెనీలు తక్కువ ధరకే మెడిసిన్ తీసుకువచ్చేలా చూడాలని కోరారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కొరకు రూ. 7500 కోట్ల ఖర్చు చేస్తోందన్నారు. ఆరోగ్యపరంగా దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా ఎదిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.
ఫార్మారంగంలో ముందున్నాం: ఈటల - ఫార్మారంగంలో ముందున్నాం: ఈటల
ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే.. దక్షిణాది రాష్ట్రాలు ఫార్మా రంగంలో వేగంగా పురోగమిస్తున్నాయని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్లో సీఐఐ, ఐఎంటీహెచ్ సంయుక్తంగా నిర్వహించిన హెల్త్ ఫార్మా సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఫార్మారంగంలో ముందున్నాం: ఈటల