Eetala and Rajgopal Reddy Meet Amith Shah :దక్షిణ భారతంలో తమ ఉనికిని చాటేందుకు బీజేపీ చేయని ప్రయత్నాలు లేవు. కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ పార్టీ అధిష్ఠానం దృష్టి తెలంగాణ ఎన్నికల వైపు మళ్లింది. బీజేపీపై నమ్మకంతో అధికార పార్టీ నేతలు పార్టీని వీడి కమలం గూటికి చేరారు. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి కూడా పార్టీ మార్చారు. కమలం పార్టీని వీడిన తర్వాత అధికార పార్టీపై, హస్తంపై విమర్శల వర్షం గుప్పించారు.
Etela and Rajagopal goes to Delhi today :గూటిని మార్చిన మొదట్లో బీజేపీలో జోష్‌గానే తిరిగిన నాయకులు ఇప్పుడు కొంత మౌనం పాటిస్తున్నారు. అంతేకాకుండా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికలవేళ ఈ అసంతృప్త గళం మంచిది కాదని భావిస్తున్న బీజేపీ హైకమాండ్ వెంటనే రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలోనే అసంతృప్తిని దూరం చేసే పనిలో పడింది. ఎన్నికల సమయంలో నేతల సమన్వయం లోపం పార్టీకి నష్టాన్ని కలిగిస్తుందని భావిస్తున్న అధిష్ఠానం లోపాన్ని సరిదిద్దే పనిలో బిజీ అయింది.
Lack Of Coordination Between BJP Leaders : రాష్ట్ర బీజేపీలో నెలకొన్న అసంతృప్తిపై పార్టీ అధిష్ఠానం దృష్టిపెట్టింది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకుండా ఉంటున్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని దిల్లీ రావాల్సిందిగా ఆదేశించారు. ఈ ఇద్దరు నేతలతో...బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా చర్చలు జరుపుతారని తెలుస్తోంది. ఈటల రాజేందర్, రాజగోపాల్‌రెడ్డి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముంగిట నేతల మధ్య సమన్వయ లోపం వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని గుర్తించిన అధిష్ఠానం... అసంతృప్తి చల్లార్చే అంశంపై దృష్టి పెట్టింది. ఈటల రాజేందర్, రాజగోపాల్‌రెడ్డితో చర్చించేందుకు రెడీ అయింది.