సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారి కోసం ఈనాడు యాజమాన్యం మరో సరికొత్త ప్రాపర్టీ షో(Eenadu Property Show)తో ముందుకొచ్చింది. హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 31వ ఈనాడు ప్రాపర్టీ షోను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ప్లాట్లు, విల్లాలతో పాటు పెట్టుబడి కోసం చూసే వాళ్లను దృష్టిలో పెట్టుకుని ఓపెన్ ప్లాట్లను ఈ ప్రాపర్టీ షోలో డెవలపర్లు ఆఫర్ చేస్తున్నారు.
నగరం నలుమూలలతో పాటు హైదరాబాద్ ఆవల పలు ఆకర్షణీయ ప్రాజెక్టులను ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. దిగువ మధ్యతరగతి నుంచి అన్ని వర్గాల వారికి అనువైన ప్రాజెక్టులను డెవలపర్లు ఆఫర్ చేస్తున్నారని, నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
అన్ని ఒకేచోట...
సిటీలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు వేర్వేరు ప్రాంతాల్లో చేపట్టిన అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్టులన్నింటినీ ఒకే చోటికి ఈనాడు ప్రాపర్టీ(Eenadu Property Show)షో తీసుకువచ్చింది. నగరంలో లగ్జరీ అపార్ట్మెంట్ ఆప్షన్స్‌తో పాటు శివార్లలో విలాసవంతమైన విల్లాలను డెవలపర్లు ఆఫర్ చేస్తున్నారు. ఈనాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాపర్టీషోలో వాసవీ, జనప్రియ, ఎన్ స్క్వేర్, రాజపుష్ప, హానర్ హోమ్స్, ఏపీఆర్ గ్రూప్, జైన్ కన్ స్ట్రక్షన్స్, ప్రగతి గ్రీన్ మెడోస్, పీవీర్ డెవలపర్స్, బీవీర్ ఇన్ ఫ్రా ఇలా మొత్తం 70 వరకు రియల్ ఎస్టేట్ సంస్థలు పాలుపంచుకుంటున్నాయి.
ఇదొక చక్కని వేదిక...