హైదరాబాద్ కొండాపూర్ సైబర్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం ఈనాడు మెగా ప్రాపర్టీ షో ప్రారంభమైంది. ఈ షో ఇవాళ కూడా కొనసాగనుంది. మంచి ఇల్లు కొనాలి ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుకునేవారికి ఈ ప్రదర్శన చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ మెగా ప్రాపర్టీ షోలో పేరొందిన రియల్ ఎస్టేట్ సంస్థలు పాల్గొని... తమ వెంచర్ల వివరాలను ప్రదర్శించనున్నాయి. గత కొన్నేళ్లుగా ఈనాడు ప్రాపర్టీ షోలో పాల్గొంటున్నామని.. వినియోగదారుల నుంచి మంచి నమ్మకం వస్తోందని రియల్టర్లు తెలిపారు.
అన్ని సంస్థలు ఒకే చోట...
కొండాపూర్లో 'ఈనాడు మెగా ప్రాపర్టీ షో' - Eenadu Property Expo
సొంతింటి కల ప్రతి ఒక్కరిది. తమకంటూ ఓ కలల గృహం కావాలన్న ఆశయంతో జీవిత కాలం శ్రమించే వారు లేకపోలేదు. ఇక కష్టపడి సంపాదించిన సొమ్మును సరైన చోట పెట్టుపడి పెట్టాలని.. చక్కని భూమి ఎలాంటి తిరకాసులు లేని ప్లాట్లు కొనుక్కోవాలని ఆలోచించే వారికి కొదవే లేదు. అయితే అంతా బాగానే ఉన్న అలాంటి నమ్మకమైన ప్రాపర్టీ ఎక్కడ దొరుకుతుందా అని చూసే వారే ఎక్కువ. అలాంటి వారికి స్వాగతం పలుకుతోంది ఈనాడు ప్రాపర్టీ షో.
విల్లాలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, లే అవుట్ వెంచర్ల వంటి నచ్చిన ప్రాపర్టీలను కొనుగోలు చేసే ముందు ఒకటి రెండు సార్లు వాటి గురించి తెలుసుకుంటారు. అయితే అందుకోసం ఒక్కో వ్యాపార సంస్థ దగ్గరకు వెళ్లి కనుక్కోవటం చాలా కష్టం. అలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సంస్థలు ఇక్కడే కొలువుదీరటంతో ఈనాడు ప్రాపర్టీ షోకి మంచి స్పందన లభిస్తోంది. దీనికి తోడు వ్యాపారులు తమ వెంచర్ల గురించి వివరించేందుకు సులభంగా ఉందంటున్నారు.
సొంతంగా ఇల్లు కొనుగోలు మొదలు... ఓపెన్ ప్లాట్ల వరకు అన్నింటి వివరాలను ఒకే చోట అందిస్తోన్న ఈనాడు ప్రాపర్టీ షోకి విశేష స్పందన లభిస్తోంది.
TAGGED:
Eenadu Property Expo