కేరళలో ఈనాడు నిర్మించిన ఇళ్లను పరిశీలించిన సంస్థ ఎండీ కిరణ్ - eenadu md kiran visited kerala checked constructed houses
కేరళలోని అలెప్పీలో వరద బాధితులకు రామోజీగ్రూప్ నిర్మించిన కొత్త ఇళ్లను ఈనాడు ఎండీ కిరణ్ సందర్శించారు. కష్టకాలంలో అండగా నిలిచినందుకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
![కేరళలో ఈనాడు నిర్మించిన ఇళ్లను పరిశీలించిన సంస్థ ఎండీ కిరణ్ eenadu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6012069-470-6012069-1581236355231.jpg)
కేరళ వరదల సమయంలో కకావికలమైన అలెప్పీలో ఈనాడు రిలీఫ్ ఫండ్ సహాయంతో నిర్మించిన కొత్త ఇళ్లను ఈనాడు ఎండీ కిరణ్ సందర్శించారు. ఈనాడు తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్, మార్గదర్శి వైస్ ప్రెసిడెంట్ రాజాజీలతో కలిసి మరియ కుళం నార్త్ పంచాయతీలో పర్యటించారు. ఆ సమయంలో సర్వం కోల్పోయి... ఇప్పుడు నూతన గృహాలు పొందిన లబ్ధిదారులతో కిరణ్ మాట్లాడారు. 420 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మితమైన నాలుగు గదుల ఇళ్ల నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. భీకర వరదల సమయంలో తమకు జరిగిన నష్టాన్ని ఈనాడు ఎండీకి వివరించిన... లబ్ధిదారులు దాతృత్వంతో కొత్త ఇళ్లను నిర్మించి ఇచ్చిన రామోజీ గ్రూప్ కి కృతజ్ఞతలు తెలిపారు. జీవితంలో మరిచిపోలేని సాయం చేశారంటూ సంతోషం వ్యక్తం చేశారు.
TAGGED:
eenadu md kiran