కేరళలో వరద బాధితుల కోసం రామోజీ గ్రూపు నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఈనాడు ఎండీ కిరణ్ హాజరయ్యారు. ఎక్కడ విపత్తులు వచ్చినా ఆదుకునేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉంటుందని కిరణ్ చెప్పారు. తెలుగు ప్రజలు ఈ దిశగా తమకు సహకారం అందిస్తున్నారని ప్రశంసించారు. ఈ సాయంలో సంస్థ ఉద్యోగుల భాగస్వామ్యమూ ఉందన్నారు. ఈ ఇళ్లను నిర్మించిన 'కుటుంబ శ్రీ' సంస్థ కృషిని కిరణ్ కొనియాడారు. తమ సంకల్పంలో కీలక పాత్ర పోషించిన యువ ఐఏఎస్ కృష్ణతేజకు ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు ప్రజల అండతోనే ఇదంతా చేయగలిగాం: ఈనాడు ఎండీ కిరణ్ - houses to flood victims by eenadu group news
కేరళ వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారికి అండగా నిలిచిన తెలుగు ప్రజలకు ఈనాడు ఎండీ కిరణ్ ధన్యవాదాలు తెలిపారు. రామోజీ గ్రూపు ఆధ్వర్యంలో వరద బాధితుల కోసం నిర్మించిన ఇళ్లను కేరళ సీఎం విజయన్ తో కలిసి లబ్ధిదారులకు అందించారు.

eenadu md kiran
కేరళ వరద బాధితులకు ఈనాడు నిర్మించిన ఇళ్ల అందజేత కార్యక్రమంలో సంస్థ ఎండీ కిరణ్
ఇదీ చదవండి:
మా కంటే రామోజీ గ్రూప్ తపనే ఎక్కువ: సీఎం విజయన్