తెలంగాణ

telangana

ETV Bharat / state

మాదకద్రవ్యాల కేసులో ఎడ్విన్​కు బెయిల్.. అసలెలా వచ్చింది! - ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం

Edwin Released on Bail: గోవా మత్తుమాఫియా మాదకద్రవ్యాల కేసులో కీలక నిందితుడు ఎడ్విన్‌, జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. పోలీసులు మూడు నెలల పాటు శ్రమించి గోవా నుంచి ఎడ్విన్‌ పట్టుకొని హైదరాబాద్‌ తీసుకొచ్చి ఎన్‌డీపీఎస్‌​ యాక్టు కింద కేసు నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కి తరలించారు. అతనిపై పీడీ చట్టం నమోదుతోపాటు ఆస్తులు జప్తుచేసే పనిలోఉండగానే ఎడ్విన్‌కు బెయిల్‌ లభించడంతో పోలీసులు కంగుతిన్నారు.

Edwin Released on Bail
Edwin Released on Bail

By

Published : Nov 17, 2022, 8:36 AM IST

మాదకద్రవ్యాల కేసులో ఎడ్విన్​ బెయిల్​పై విడుదల.. అసలు బెయిల్ ఎలా విచ్చింది...!

Edwin Released on Bail: మాదకద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడు ఎడ్విన్‌ను పోలీసులు అరెస్టుచేసి 10రోజులు గడవముందే బెయిల్‌పై విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది. ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదైతే నెలల తరబడి జైలుకే పరిమితం కావాల్సివస్తుంది. ఐతే అరెస్టయిన రోజుల వ్యవధిలో కేసులో కీలక నిందితుడు బెయిల్‌పై విడుదలకావడం కలకలం రేపుతోంది.

గోవా ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌కు కొకైన్‌, హెరాయిన్‌, ఎమ్​డీఎమ్​ఏ, ఎల్​ఎస్​డీ వంటి మాదకద్రవ్యాలు.. దిగుమతి అవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఎడ్విన్‌ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. యువతను మత్తుకు బానిసలుగా చేయకుండా కాపాడే ఉద్దేశంతో, హైదరాబాద్‌ పోలీసులు.. కీలకమైన ఆపరేషన్లు చేయడం ప్రారంభించారు. ఈ తరుణంలో ప్రత్యేకంగా నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ పేరిట ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశారు.

ఆ బృందాలు ఉస్మానియాయూనివర్శిటీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తార్నాకాలో ప్రీతీష్‌ బోర్కర్‌ అనే గోవా డ్రగ్‌స్మగ్లర్‌ని పట్టుకోగా, మాదకద్రవ్యాల వ్యవహారం మొత్తం బయటపడింది. గోవాలో మత్తుదందా కొనసాగిస్తున్న, డిసౌజా అనే మరో డ్రగ్‌ స్మగ్లర్‌ను పోలీసులు పట్టుకున్నారు. అతడితో సంబంధాలు ఉన్న దాదాపు 600 మంది తెలుగు రాష్ట్రాల వినియోగదారులను గుర్తించి కేసులు నమోదుచేయడం ప్రారంభించారు.

ఈ తరుణంలో మత్తు దందాలో కీలకంగా ఉంటున్న ఎడ్విన్‌ పేరు వెలుగులోకి వచ్చింది. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. కలకలం రేపిన గోవా కర్లీస్‌ షాక్‌ రెస్టారెంట్‌లో, అనుమానస్పద స్థితిలో మృతి చెందిన భాజపా నాయకురాలు సోనాలీ పొగాట్‌ మృతికేసులో నిందితుడిగా ఉన్న ఎడ్విన్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం పోలీసులకు దొరకకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్లాడు.

ఆ ఘరానా మత్తుమాఫియా నాయకుడిని పట్టుకునేందుకు, పోలీసులు న్యాయస్థానాలను ఆశ్రయించి ఈనెల 5న గోవా నుంచి పట్టుకొచ్చారు. అలాంటి వ్యక్తి బెయిల్‌ పొంది తప్పించుకోవడంతో పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. ఎడ్విన్‌పై ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద హైదరాబాద్‌ రాంగోపాల్‌పేట్‌, ఉస్మానియా యూనివర్శిటీ, లాలాగూడ పోలీస్‌స్టేషన్లలో కేసులునమోదయ్యాయి.

వాటిలో రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ కేసులో ఈనెల 5న అరెస్టు చేశారు. అంతకుముందే ఎడ్విన్‌, మరో రెండు పోలీస్‌స్టేషన్లలోని కేసుల్లో ముందస్తుగా బెయిల్‌ పొందాడు. బెయిల్‌పై జైలు నుంచి ఎడ్విన్‌ విడుదల కావడం పోలీసు ఉన్నతాధికారులను విస్మయానికి గురి చేసింది. ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదైనా బెయిల్‌ ఎలా లభించిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details