తెలంగాణ

telangana

ETV Bharat / state

Courses after 10th class : 'పది' తర్వాత ఏ కోర్సులో చేరుతున్నారు..?

Courses after 10th class : పదో తరగతి పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ మైండ్​లో తిరుగుతూ ఉంటుంది. మనకు తెలిసినవి.. ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా రెండే దారులు. కానీ పదో తరగతి పూర్తయ్యాక విద్యార్థుల చేతిలో చాలా అవకాశాలున్నాయి. మరి స్టూడెంట్స్.. మీ అభిరుచికి తగ్గ అవకాశమేందో మీకు తెలుసా..? తెలియకపోతే ఈ స్టోరీ చదివేయండి.. మీ ఛాయిస్​ను సెలెక్ట్ చేసుకోండి..?

Educational Opportunities
Educational Opportunities

By

Published : May 15, 2023, 2:19 PM IST

Courses after 10th class : ఇటీవలే 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి తర్వాత పిల్లలు తీసుకునే కోర్సులపైనే వారి భవిష్యత్​ ఆధారపడి ఉంటుంది. ఎస్సెస్సీ తర్వాత ఏ కోర్సులో చేరాలి..? ఏ విద్యాలయాల్లో చదవాలి అనే ఆలోచనలు ప్రతి ఒక్కరి మైండ్​లో మెదిలే ఆలోచన. కానీ విద్యార్థులు వారి అభిరుచికి తగ్గట్టుగా కోర్సులను ఎంపిక చేసుకుంటే వారి జీవితాలు బంగారు బాటలో పడినట్టే అంటున్నారు విద్యానిపుణులు.

Educational Opportunities To 10th Students : ఇంటర్ తర్వాత గురుకులాల్లో చదువుకోవాలంటే.. ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆ పరీక్షలో వచ్చిన వచ్చిన మార్కులను బట్టి ఇక్కడ చదివే అవకాశం కల్పిస్తారు. ఈ విద్యాలయాల్లోనే చదువు, విద్యార్థుల వసతి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఆంగ్ల మాధ్యమంలో విద్యను బోధిస్తారు. దీంతో పాటు కంప్యూటర్​, క్రీడలు వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇంటర్​ తర్వాత పై చదువులకు ప్రవేశం పొందటానికి నీట్, ఎంసెట్​ మొదలగు వాటిపై విద్యార్థులను సిద్ధం చేస్తారు. ప్రతి విభాగంలో విద్యార్థులకు 40 సీట్లు ఉంటాయి. వాటిని కాస్ట్​ రిజర్వేషన్​, వచ్చిన మార్కులను బట్టి కేటాయిస్తారు. ప్రతి సంవత్సరం 6800 విద్యార్థులకు బోధన సాగిస్తున్నారు.

ఆంగ్ల మాధ్యమంలో ఉచితంగా బోధన : ప్రైవేటు కాలేజీలకు దీటుగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్​ ఇంగ్లీషు మీడియంలో చదవాలి అనుకుంటే వారికి ఆదర్శ విద్యాలయాలు చక్కటి వేదిక. అన్ని రకాల వసతులతో ఇక్కడ విద్యను అందిస్తారు. ప్రతి విద్యాలయంలో ఎంఈసీ, ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులు ఉంటాయి. ప్రతి కోర్సులో 40 మంది విద్యార్థులు చేరవచ్చు. దీంతో పాటు ప్రతి విభాగంలో బాలికలకు 33 శాతం రిజర్వేషన్​ ఉంటుంది. ప్రోపెషినల్​ కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తారు. ఉమ్మడి జిల్లాల్లో మొత్తం కలిపి 25 ఆదర్శ విద్యాలయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 7 వేల మంది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉంది.

క్యాటగిరీ రిజర్వేషన్​(శాతం)
ఎస్సీ 15
ఎస్టీ 6
బీసీ 29
జనరల్​ 50
దివ్యాంగులు 3

పేద విద్యార్థులకు అవకాశం : రాష్ట్రంలో క్రమశిక్షణతో విద్యను అందించే వాటిల్లో జ్యోతిబాఫులే విద్యాలయం ఒకటి. పేద విద్యార్థులకు తోడుగా నిలుస్తున్నాయి. ఇందులో బాలికలకు, బాలురకు విడిగా వసతి సౌకర్యం కల్పిస్తారు. పుస్తకాలు, ఏకరూప దుస్తులతో పాటు విద్యార్థులకు కావలసిన వస్తువులను అందిస్తారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేకంగా తరగతులు ఉంటాయి. దీనిలో చేరడానికి విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. దాని ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఉమ్మడి జిల్లాలో 22 జ్యోతిబాఫులే విద్యాలయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇందులో 5600 మంది విద్యార్థులు ప్రవేశం పొందుతున్నారు.

పాలిటెక్నిక్​ చేయాలి అనుకుంటే : పదో తరగతి తర్వాత అందరూ పాలిటెక్నిక్ వైపు వెళ్లడానికి ఆలోచిస్తారు. ఈ కోర్సు 3 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో చేరాలంటే పాలిసెట్​ పరీక్ష రాయాలి. వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. హైదరాబాద్​, నిజామాబాద్​లో పాలిటెక్నిక్​ కాలేజీలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఆసక్తి ఉన్నవారు అగ్రికల్చర్​ పాలిటెక్నిక్​లో చేరవచ్చు. ర్యాంకు మంచిగా వస్తే హైదరాబాద్‌లోని ప్రముఖ విద్యాసంస్థల్లో సీటు లభిస్తుంది. అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కోర్సు 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేస్తే వ్యవసాయ శాఖలో ఏఈనోలుగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. జగిత్యాల జిల్లాలోని పొలాసలో ఈ కళాశాల ఉంది.

మంచి మార్కులతో ఐఐఐటీలో సీటు : పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు ఐఐఐటీ ఓ వరం. 6 సంవత్సరాల పాటు సమీకృత ఇంజినీరింగ్‌ డిగ్రీలో ప్రవేశాలను కల్పిస్తున్నారు. పదిలో వచ్చిన మార్కులను బట్టి సీట్లను కేటాయిస్తారు. విద్యార్థుల ఇష్టాలను బట్టి వివిధ కోర్సుల్లో చేరవచ్చు. దీంట్లో మొత్తం 1500 సీట్లు ఉంటాయి. రిజర్వేషన్ల ప్రకారం సీట్లను కేటాయిస్తారు. ఉమ్మడి జిల్లాలో ప్రతి సంవత్సరం వందకుపైగా విద్యార్థులు ఇందులో ప్రవేశం పొందుతున్నారు.

బాలికలకు ప్రత్యేకంగా : కస్తుర్బా గాంధీ విద్యాలయాల్లో పేద బాలికలకు బాసటగా నిలుస్తున్నాయి. ఇంటర్​లో చేరడానికి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఈ విద్యాలయాల్లో ప్రవేశం పొందవచ్చు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 44 విద్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ బాలికలకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ప్రతి సంవత్సరం 16000 మంది విద్యార్థినిలు విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details