ప్రస్తుతం కరోనా(corona) అదుపులో ఉందని... విద్యా సంస్థల ప్రారంభానికి(schools reopen) ఇదే సరైన సమయమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(SABITHA INDRA REDDY) అన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఇంట్లో మాదిరిగానే విద్యా సంస్థల్లో జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. హైదరాబాద్‌లోని మహబూబియా ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి... సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభానికి విద్యా సంస్థలను సిద్ధం చేస్తున్నామని వివరించారు.
ప్రత్యక్ష బోధన మాత్రమే..
విద్యార్థులను పాఠశాలలకు పంపాలని బలవంతం చేయబోమని స్పష్టం చేశారు. ప్రత్యక్ష బోధన మాత్రమే కొనసాగుతుందని తెలిపారు. ఆన్‌లైన్ బోధనతో(online classes) పూర్తిస్థాయి ప్రయోజనాలు నెరవేరట్లేదని వెల్లడించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు జరిపి ఇంటికి పంపిస్తామని వివరించారు. పాఠశాలలు నెలవారీగానే ఫీజులు తీసుకోవాలని సూచించారు.