తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలు పాటించాల్సిందే : కొప్పుల - సీఎం ఆదేశాలతో విద్యాసంస్థల ప్రారంభం

సీఎం ఆదేశాలతో వచ్చేనెల నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్​ అన్నారు. తొమ్మిది ఆపై తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. విద్యాలయాల్లో కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

educational institutions started in february
విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలు అమలు చేయాలన్న మంత్రి కొప్పుల ఈశ్వర్​

By

Published : Jan 11, 2021, 8:57 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి నుంచి విద్యాసంస్థలు ప్రారంభమవుతాయని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో తొమ్మిదో తరగతి నుంచి విద్యాసంస్థలు తెరవనున్నట్లు స్పష్టం చేశారు.

వచ్చేనెల నుంచి ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, కళాశాలలు తెరుచుకుంటాయని మంత్రి తెలిపారు. విద్యాలయాల్లో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆరోగ్య భద్రతకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

ఇదీ చూడండి :భాజపా, తెరాస మధ్య చీకటి ఒప్పందం: ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details