ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యానందించి రాష్ట్రాన్ని దేశంలోనే మొదటిస్థానంలో నిలిపేందుకు అందరూ ప్రయత్నించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ మంత్రిగా నియామకమై తొలిసారిగా ఉన్నత విద్యాశాఖాధికారులతో సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. మిషన్ భగీరథ పథకంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు తాగునీటి సౌకర్యం కల్పించడానికి స్థానిక అధికారులను సంప్రదించాలని మంత్రి సూచించారు. మార్చి 2019 ఎస్సెస్సీ వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించినందుకు అధికారులను అభినందించిన మంత్రి... మున్ముందు కూడా విద్యాశాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. తనను కలవడానికి వచ్చే వారు పూలమాలలు, బోకేలకు బదులుగా ప్రభుత్వ నోటుపుస్తకాలు ఇవ్వాలని మంత్రి కోరారు. తనను కలిసినవారు ఇప్పటి వరకు 30,000 నోటు పుస్తకాలు ఇచ్చారని... వాటిని త్వరలోనే పేద విద్యార్థులకు పంపిణీ చేస్తామని వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
"విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి" - sabitha review
గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రతిభ స్థానిక బడులకే పరిమితం కాకూడదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు.
విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి
ఇవీ చూడండి: ఇది నా జీవితంలో నూతన అధ్యాయం: దత్తాత్రేయ
Last Updated : Sep 11, 2019, 9:07 PM IST