తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇంటర్​ ఫలితాల్లో పాత తప్పులు పునరావృతం కావు' - తప్పులు పునరావృతం కావు: సబితాఇంద్రరెడ్డి

ఇంటర్మీడియట్ బోర్డులో జరిగిన ఘటనలను పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్​ నాంపల్లిలోని వనిత మహావిద్యాలయంలో అధ్యాపకులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తప్పులు పునరావృతం కావు: సబితాఇంద్రరెడ్డి

By

Published : Nov 19, 2019, 5:29 PM IST

హైదరాబాద్​ నాంపల్లిలోని వనిత మహావిద్యాలయంలో విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించే అధ్యాపకులకు రెండు రోజుల శిక్షణ మొదలైంది. ఈ కార్యక్రమాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రరెడ్డి ప్రారంభించారు.

ఇంటర్​ బోర్డులో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు ఇంటర్​లోనే మంచి సూచనలు ఇస్తే.. ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉందన్నారు. తల్లిదండ్రుల ఇష్టమైన కోర్సుల్లో కాకుండా పిల్లల అభిరుచితో చదివించాలని విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి అన్నారు. మానసిక ఒత్తిడికి ప్రతి ఒక్కరు గురవుతారని.. దాన్ని అధిగమించినపుడే లక్ష్యం చేరుకుంటారని పేర్కొన్నారు.

తప్పులు పునరావృతం కావు: సబితాఇంద్రరెడ్డి

ఇవీ చూడండి : కిడ్నాప్​ కేస్​ - నాన్న ఫోన్​ నెంబర్​ గుర్తుంది.. కాల్​ చేశా..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details