Minister Sabitha Indra Reddy on Bandi Arrest: పదో తరగతి పేపర్ల లీకేజీ ఘటనలో కుట్ర కోణం ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ఈ ప్రశ్నపత్రం లీకేజీ వెనుక ఎంతటి వారున్నా ఉపేంక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే.. ఈ కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. కేంద్రంలో బీజేపీ పెద్దల సూచనతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుట్రలకు తెరతీశారని విమర్శించారు. స్వార్ధ పూరిత రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలతో ఆటల అని ప్రశ్నించారు. పదో తరగతి పరీక్షల్లో సిబ్బంది ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు.
బాధ్యత లేకుండా, బాధ్యతను విస్మరించి రాజకీయ కోణంలో.. రాజకీయ కుట్రలో భాగంగా ఈ రెండు ఘటనలు జరిగాయి. ఏం జరిగిందని అది కూడా వదిలేసి రాజకీయంగా పిల్లల భవిష్యత్తో ఆడుకుంటున్న మీరు తల వంచుకోవాలి. అది వదిలేసి తప్పు చేసినా కూడా తల ఎగరేసి జెండా పట్టుకుని రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారు. పదోతరగతి పరీక్షలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది. -సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి