తెలంగాణ

telangana

ETV Bharat / state

బడుల బాగుకు మండలమే యూనిట్‌ - telangana state news

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది. అందులో భాగంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులతో విధి విధానాల రూపకల్పనపై సమీక్షించారు.

education ministre sabitha indra reddy latest updates
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

By

Published : Apr 20, 2021, 8:07 AM IST

ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది రూ.2 వేల కోట్లతో మౌలిక వసతులు కల్పించేందుకు మండలం యూనిట్‌గా బడులను ఎంపిక చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రతి మండలంలో 30-35 శాతం బడులను ఎంపిక చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఇందుకోసం మండలంలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న పాఠశాలలను కొలమానంగా తీసుకుంటారు. తాజాగా ఈ పథకం అమలుకు విధి విధానాల రూపకల్పనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సమీక్షించారు. వీటిపై త్వరలో ఉప సంఘం చర్చించి తుది నిర్ణయం కోసం సీఎం ఆమోదానికి పంపించనున్నారు.

ఇదీ చదవండి:నేటి నుంచి ప్రైవేట్​ ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆర్థిక సాయం

ABOUT THE AUTHOR

...view details