గణితం... పేరు వింటేనే చాలామంది పిల్లలు బెదిరిపోతారు. లెక్కల చిక్కుముళ్లు విప్పలేక చదువులో వెనుకబడిపోతారు. అలాంటి గణితాన్ని పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా బోధిస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వుమ్మాజీ పద్మప్రియ. ఈమె సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికచేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక మహిళా ఉపాధ్యాయురాలీమె.
ఉత్తమ ఉపాధ్యాయురాలికి మంత్రి సన్మానం - Vummaji Padmapriya LATEST NEWS
రాష్ట్రం నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన వుమ్మాజి పద్మప్రియను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం తన కార్యాలయంలో శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సాంకేతిక విద్యాశాఖ, ఇంటర్ విద్యాశాఖ కమిషనర్లు నవీన్ మిత్తల్ జలీల్ తదితరులు పాల్గొన్నారు.
వుమ్మాజి పద్మప్రియను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం తన కార్యాలయంలో శాలువాతో సన్మానించారు. టీచింగ్ ఎక్స్‌లెన్సీ అండ్ అఛీవ్‌మెంట్ కార్యక్రమానికి ఎంపికై అమెరికాలో శిక్షణ పొందిన పద్మప్రియ అక్కడి బోధనా విధానాలను స్థానికంగా అమలు చేసి సత్ఫలితాలు సాధించారని ప్రశంసించారు. కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సాంకేతిక విద్యాశాఖ, ఇంటర్ విద్యాశాఖ కమిషనర్లు నవీన్ మిత్తల్ జలీల్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ ముందుకు.. కొత్త రెవెన్యూ చట్టం!