రాష్ట్రంలో పాఠశాలల్ని ఎప్పుడు తెరుస్తారు? అసలు తెరుస్తారా? లేదా? జీరో విద్యా సంవత్సరం చేస్తారా? లక్షలాది మంది తల్లిదండ్రులను సతమతం చేస్తున్న ప్రశ్నలివి. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పాఠశాలల్ని తెరిచారు. మరికొన్ని రాష్ట్రాలు తేదీల్ని ప్రకటించాయి. 10, 12 తరగతుల విద్యార్థులకు జనవరి 4 నుంచి పాఠశాలలు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ కౌన్సిల్(సీఐఎస్‌సీఈ) ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసింది. రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలు కూడా పాఠశాలలు తెరవాలని కోరుతున్నాయి.
పాఠశాలల ప్రారంభంపై త్వరలో సమావేశం! - హైదరాబాద్ తాజా వార్తలు
రాష్ట్రంలో పాఠశాలల్ని ఎప్పుడు తెరుస్తారు? అసలు తెరుస్తారా? లేదా? జీరో విద్యా సంవత్సరం చేస్తారా? అనే ప్రశ్నలు తల్లిదండ్రులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. పాఠశాలల ప్రారంభంపై త్వరలో సమావేశం నిర్వహించనున్నారు. ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితిపై సీఎస్ నివేదిక కోరినట్లు సమాచారం.
పాఠశాలల ప్రారంభంపై త్వరలో సమావేశం!
ఈ క్రమంలో ఈ అంశంపై ఇతర రాష్ట్రాలు ఏం చేస్తున్నాయో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ తాజాగా విద్యాశాఖను ఆదేశించినట్లు సమాచారం. నివేదిక వచ్చాక ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేయవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. జాగ్రత్తలు తీసుకుంటూ తెరవాలని రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజా భానుప్రతాప్ సూచించారు.