పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై హైకోర్టుకు విద్యా శాఖ నివేదిక సమర్పించింది. పరీక్ష కేంద్రాలను 2530 నుంచి 4535కి పెంచామని న్యాయస్థానానికి తెలిపింది. విద్యార్థులకు కొత్తగా హాల్ టికెట్లు ఇవ్వడం లేదని.. పరీక్ష కేంద్రాల వివరాలను విద్యార్థులకు సమాచారం ఇచ్చామని కోర్టుకు నివేదించింది. థర్మల్ స్క్రీనింగ్ కిట్లు, మాస్కులు, గ్లౌజులు సేకరించి కేంద్రాలకు పంపించామని విద్యా శాఖ తెలిపింది. కేంద్రానికి ఒకరు చొప్పున 4535 మంది వైద్య సిబ్బందిని నియమించామని పేర్కొంది.
పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై హైకోర్టుకు విద్యా శాఖ నివేదిక - 10th class exams
పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి విద్యాశాఖ నివేదిక సమర్ఫించింది. పరీక్ష కేంద్రాలను పెంచామని, పలు ఏర్పాట్లు చేశామని హైకోర్టుకు వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక బస్సులు నడుపుతామని తెలిపింది. పరీక్షలకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ విన్నవించుకుంది.
డీఈఓ కార్యాలయాల్లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని విద్యాశాఖ కోర్టుకు వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో విద్యార్థుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతామని స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లలో పదోతరగతి పరీక్ష కేంద్రాలు లేవని నివేదికలో తెలిపింది. ఒక్కో విద్యార్థి మధ్య 5,6 అడుగులు దూరం ఉండేలా ఏర్పాట్లు చేశామని.. వ్యాధి నిరోధక శక్తిని పెంచే మందులు సరఫరా చేయాలని ఆయుష్ విభాగాన్ని కోరామని విద్యాశాఖ కోర్టుకు నివేదించింది. పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టు రేపు మరోసారి విచారణ చేపట్టనుంది. పరీక్షలపై శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇవీ చూడండి: కరోనా సమయంలో పదోతరగతి పరీక్షలా..!