తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Decade Celebrations 2023 : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు 'చదువుల పండుగ' - చదువుల పండగ

Education Day Celebrations In Telangana : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు 'చదువుల పండుగ' నిర్వహించనున్నారు. పూర్తయిన "మన ఊరు మన బడి" పాఠశాలలతో పాటు సుమారు పదివేల గ్రంథాలయాలు, దాదాపు 1600 డిజిటల్ తరగతి గదులను ప్రారంభించనున్నారు. విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్‌లు, ప్రాథమిక పాఠశాలల టీచర్లకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు.

Telangana Vidya Dinotsavam Today
Telangana Vidya Dinotsavam Today

By

Published : Jun 20, 2023, 7:06 AM IST

Telangana Education Day 2023 :రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ విద్యా దినోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధిం చేసింది. విద్యా రంగంలో సాధించిన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు రవీంద్రభారతిలో జరగనున్న వేడుకల్లో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు.

Education Day Celebrations In Telangana : రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు విద్యా దినోత్సవంలో పాల్గొంటారు. గురుకులాలు, వైద్య, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ, అటవీ, వ్యవసాయ, ఉద్యానవన, పశువైద్య, మత్స్య విద్యాసంస్థల్లో ఉత్సవాలు జరగనున్నాయి. తొమ్మిదేళ్లలో విద్యారంగంలో రాష్ట్రం సాధించిన విజయాలను వివరిస్తారు. పనులు పూర్తయిన సుమారు 700కి పైగా 'మన ఊరు మన బడి' పాఠశాలలను నేడు ప్రారంభించనున్నారు.

Telangana Vidya Dinotsavam Today :రాష్ట్రంలో పది వేల గ్రంథాలయాలను, 1600 డిజిటల్ తరగతి గదులను కూడా ప్రారంభిస్తారు. అలాగే పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు, ఉపాధ్యాయులకు ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నారు. పాఠశాలల్లో విద్యార్ధులకు చిత్రలేఖనం, పాటల పోటీలు, వ్యాసరచన తదిదర తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రభుత్వ పాఠశాలలను మామిడి తోరణాలతో, పూలతో అందంగా అలంకరించి విజయోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు.

Telangana Decade Celebratins 2023 :మన ఊరు మన బడి, వెయ్యి గురుకులాల స్థాపన, నూతన విశ్వవిద్యాలయాల ఏర్పాటు, జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కాలేజీ ఏర్పాటు, నూతనంగా నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు, జూనియర్, డిగ్రీ కాలేజీల ఏర్పాటు తదితర వివరాలను ప్రజల్లో ప్రచారం చేస్తారు. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను తెలియజేస్తూ ర్యాలీలు నిర్వహిస్తారు. బడుల్లో జాతీయ జెండాను ఎగురవేస్తారు. రాష్ట్రంలోని డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో.. సాంస్కృతిక కార్యక్రమాలు, బోధన, బోధనేతర సిబ్బందికి సన్మాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Decade Celebrations In Telangana :సోమవారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులో నిర్వహించిన హరితోత్సవంలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. తుమ్మలూరు అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లో మహాగని మొక్కను నాటి తొమ్మిదో విడత హరితహారాన్ని ప్రారంభించారు. అనంతరం అటవీశాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను వీక్షించి అటవీశాఖ అధికారుల పనితీరును ప్రశంసించారు. అనంతరం బీటీఆర్ గార్డెన్‌లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన కేసీఆర్.. పాలమూరు రంగారెడ్డి పనులు అడ్డుకున్న కాంగ్రెస్‌ నేతలే.. పనులు చేయలేదంటూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని అవరోధాలు సృష్టించినా ప్రజలకు మంచి జరిగే విషయంలో వెనక్కి తగ్గేది లేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 276 కోట్ల మొక్కలు నాటినట్లు చెప్పిన ఆయన.. పచ్చదనం పెంచేందుకు కృషిచేసిన సర్పంచులు, అటవీశాఖ అధికారులను ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details