తెలంగాణ

telangana

ETV Bharat / state

సైబర్ నేరాల్లో చదువుకున్నవారే ఎక్కువ మోసపోతున్నారు! - cyber frauds in telangana

సైబర్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేసే మోసాల పట్ల అవగాహన పెంచుకునేలోపు.. కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. యూపీఐ, వాలెట్లను ఉపయోగిస్తున్న ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని నగదు కొల్లగొడుతున్నారు.

educated people are getting fraud by cyber crime persons
సైబర్ నేరాల్లో చదువుకున్నవారే ఎక్కువ మోసపోతున్నారు!

By

Published : Feb 25, 2020, 6:36 AM IST

Updated : Feb 25, 2020, 12:02 PM IST

సైబర్ నేరాల్లో చదువుకున్నవారే ఎక్కువ మోసపోతున్నారు!

సైబర్ మోసగాళ్లకు అడ్డుకట్ట పడట్లేదు. అమాయకులను నమ్మించి బ్యాంకు ఖాతాల్లో నగదు లాగేసుకుంటున్నారు. సైబర్ మోసాలపట్ల ఖాతాదారులు అవగాహన పెంచుకునే లోపు... కొత్త రీతిలో దోచుకుంటున్నారు. వ్యాలెట్, యూపీఐ వివరాలు సేకరించడం, బీమా, రుణాల పేరుతో ఆకర్షిస్తున్న సైబర్ నేరస్థులు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు.

రోజుకు సుమారు 300 మందికి ఫోన్లు..

బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం... మీ ఖాతా గడువు ముగిసి పోయింది... పునరుద్ధరించాలంటే ప్రస్తుత ఖాతాకు సంబంధించిన వివరాలు చెప్పాలని... ఖాతాదారులను బురిడి కొట్టించి.. సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. సెల్ ఫోన్ ఆపరేటర్ల వద్ద సేకరిస్తున్న వివరాలతో సైబర్ నేరగాళ్లు రోజుకు సుమారు 300 మందికి ఫోన్ చేస్తున్నారు. వారిలో ఒక శాతం మంది నమ్మినా.. ఖాతాలో సొమ్ము పోయినట్లే. ఖాతా గడువు ముగిసిందనో, లేకపోతే ఓఎల్ఎక్స్​లో అమ్మకాలు చేస్తామనో... బీమా సొమ్ము వచ్చిందనో నమ్మిస్తున్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్​కు చెందిన ముఠాలు.. హైదరాబాద్​ వాసులకు ఫోన్​ చేయడమే పనిగా పెట్టుకున్నారు.

చదువుకున్నవారే సులువుగా..

అమాయకులే కాదు.. చదువుకున్న వాళ్లూ సైబర్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. హైదరాబాద్​ పోలీస్ కమిషనరేట్​లో ఎస్పీవోగా పనిచేస్తున్న ఓ అధికారి.. తన కుమారునికి ఉద్యోగం వస్తుందని నమ్మి రూ.60 వేల నగదు బదిలీ చేశారు. చివరికి మోసపోయానని గుర్తించి సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిమాయత్​నగర్​లో ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేసే ఉద్యోగి.. పేటీఎం అప్​డేట్ చేయాలని సైబర్​ నేరగాళ్లు చెప్పగా వారికి పూర్తి వివరాలు ఇచ్చి మోసపోయారు. ఇలా హైదరాబాద్​లో రూ.20 కోట్లకు పైగా నగదును సైబర్​ నేరగాళ్లు కాజేశారు.

బ్యాంకు అధికారుల పేరిట ఎవరూ మోసం చేయరని.. ఖాతాకు సంబంధించిన రహస్య వివరాలు చెప్పొద్దని పోలీసు, బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ సైబర్​ మోసాలకు పాల్పడితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు.

ఇదీ చూడండి :నమస్తే ట్రంప్​: పర్యటన తొలిరోజు హైలైట్స్​

Last Updated : Feb 25, 2020, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details