ED Raids on EX MP Vivek Update :మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి జీ వివేక్‌కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ ద్వారా తాజాగా రూ.100 కోట్ల నగదు బదిలీ జరిగినట్లు ఈడీ(Enforcement Directorate) దర్యాప్తులో తేలింది. విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థకు ఈ నగదు తరలింపులో ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించింది. వివేక్ బ్యాంకు ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీస్‌కు రూ.8 కోట్లు తరలినట్లు పోలీసుల సమాచారంతో ఈడీ దర్యాప్తును ప్రారంభించిన సంగతి విదితమే.
ED Raids on Congress Candidate Vivek : ఈ క్రమంలోనే మంగళవారం రోజున హైదరాబాద్, రామగుండం, మంచిర్యాలలోని వివేక్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ బృందాలు తనిఖీలు చేశాయి. ఆయా ప్రాంతాల్లో లభించిన ఆధారాలను బట్టి వివేక్, అతడి భార్య నిర్వాహకులుగా ఉన్న విశాఖ ఇండస్ట్రీస్(Visakha Industries) లావాదేవీలను పరిశీలించాయి. విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థ తన వ్యాపార కార్యకలాపాల ద్వారా సుమారు రూ.20 లక్షల ఆదాయం పొందినట్లు బ్యాలెన్స్ షీట్లలో తెలిపినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. మొత్తంగా సంస్థలో రూ.200 కోట్లు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అయితే విశాఖ ఇండస్ట్రీస్‌తో విజిలెన్స్ సెక్యూరిటీస్‌కు వాస్తవ వ్యాపార లావాదేవీలు లేవని కానీ.. ప్రస్తుతం విజిలెన్స్ సెక్యూరిటీ వివేక్ నియంత్రణలోనే ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
విజిలెన్స్ సెక్యూరిటీస్‌కు యశ్వంత్ రియల్టర్స్ మాతృసంస్థగా ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ రియల్టర్స్‌లో అధికశాతం వాటాలు ఓ విదేశీయుడి పేరిట ఉన్నట్లు తేలింది. విదేశీ సంస్థలో విజిలెన్స్ సెక్యూరిటీస్‌ను విలీనం చేయడంలో ఫెమా ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని ఈడీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. గ్రూపు సంస్థల ఆస్తి ఒప్పందాల్లో లెక్కలో లేని నగదును వినియోగించినట్లు తెలిపారు. విజిలెన్స్ సంస్థ పేర్కొన్న చిరునామాల్లో దాని ఉనికి లేదని గుర్తించారు.
రాష్ట్రంలో మరోసారి ఐటీ దాడుల కలకలం - కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో సోదాలు