ed raids in nri medical collages ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలపై జరిపిన సోదాల్లో 53 చోట్ల స్థిరాస్తలును గుర్తించి నగదు, కీలకపత్రాలు, పలు ఆస్తులు సీజ్ చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఈనెల రెండు, మూడు తేదీల్లో విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.
ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలపై ఈడీ సోదాలు.. పలు కీలకపత్రాలు, ఆస్తులు సీజ్ - ఈడీ సోదాలు హైదరాబాద్
ed raids in nri medical collages ఎన్‌ఆర్ఐ మెడికల్ కళాశాలపై ఈడీ సోదాలు నిర్వహించింది. నగదు, కీలకపత్రాలు, పలు ఆస్తులు సీజ్ చేసినట్లు ప్రకటించింది. ఎన్‌ఆర్ఐ సొసైటీకి చెందిన నిధులను భవన నిర్మాణాల పేరుతో దుర్వినియోగం చేశారని విచారణలో అధికారులు తేల్చారు.
ఎన్ఆర్ఐ సొసైటీకి చెందిన నిధులను భవన నిర్మాణాల పేరుతో దుర్వినియోగం చేశారని... కొవిడ్ సమయంలో రోగుల నుంచి భారీగా నగదు వసూలు చేశారని ఈడీ అధికారులు వివరించారు. కొవిడ్ నుంచి వచ్చిన ఆదాయాన్ని ఎన్‌ఆర్‌ఐ సొసైటీ ఖాతాల్లో చూపించలేదని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఎంబీబీఎస్ విద్యార్థుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో ఆడ్మిషన్ల పేరుతో వసూలు చేశారని ఈడీ అధికారులు తెలిపారు. ఇలా ఇచ్చిన ఆదాయాన్ని దారి మళ్లించినట్లుగా పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌ఐ సొసైటీ ఖాతా నుంచి ఎన్‌ఆర్‌ఐఏఎస్ అనే మరో ఖాతాకు బదిలీ చేసినట్లు గుర్తించినట్లు ఈడీ అధికారులు వివరించారు.
ఇవీ చూడండి