తెలంగాణ

telangana

ETV Bharat / state

Tollywood drug case: తరుణ్​ను ఏడుగంటలు ప్రశ్నించిన ఈడీ.. బ్యాంకు లావాదేవీలపై ఆరా - ఈడీ ముందు హాజరైన తరుణ్

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుకు(tollywood drugs case) సంబంధించి మనీలాండరింగ్​ వ్యవహారంలో నటుడు తరుణ్‌ (Actor Tharun) విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ(ED) అధికారులు ఆయనకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీశారు. తరుణ్‌ నమూనాల్లో డ్రగ్స్‌ ఆనవాళ్లు లేవన్న ఎఫ్ఎస్‌ఎల్‌ నివేదిక ప్రకారం అతనికి ఇప్పటికే ఎక్సైజ్‌శాఖ క్లీన్‌చిట్‌ ఇచ్చింది.

ED questioned Tharun
మనీలాండరింగ్​ వ్యవహారంలో నటుడు తరుణ్​ను ప్రశ్నించిన ఈడీ

By

Published : Sep 22, 2021, 9:09 PM IST

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించిన వ్యవహారంలో సినీ నటుడు తరుణ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) 7 గంటల పాటు విచారించింది. తరుణ్‌ బ్యాంకు ఖాతాలోని అనుమానాస్పద లావాదేవీలపై ఈడీ ఆరా తీసింది. మనీలాండరింగ్‌ కేసులో తరుణ్‌కు (Actor Tharun) నోటీసులు ఇవ్వగా.. ఇవాళ విచారణకు హాజరయ్యారు. తరుణ్‌ నమూనాల్లో డ్రగ్స్‌ ఆనవాళ్లు లేవని ఎఫ్​ఎస్​ఎల్ (FSL) నివేదిక స్పష్టం చేసింది.

ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను ప్రశ్నించిన అధికారులు.. వారివారి ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరించారు. తరుణ్ వెంట ఆయన తండ్రి కూడా వచ్చారు. కొన్ని పత్రాల గురించి ఈడీ అధికారులు అడగడంతో ఆయన తండ్రి ఈడీ కార్యాలయం నుంచి వెళ్లి పత్రాలను తీసుకొచ్చారు. సాయంత్రం 6 గంటల సమయంలో ఈడీ విచారణ ముగియడంతో అతను కార్యాలయం నుంచి వెళ్లిపోయాడు.

మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ (ED) నోటీసులు ఇవ్వగా.. వాళ్లందరి విచారణ దాదాపు తుదిదశకు చేరుకుంది. అందరి బ్యాంకు ఖాతాలను పరిశీలించిన అధికారులు... మనీలాండరింగ్​కు సంబంధించిన ఆధారాలపైనే ఆరా తీశారు. ఎక్సైజ్‌శాఖ విచారణలో కెల్విన్‌ వాంగ్మూలం అధారంగా ఈడీ(ED) అధికారులు టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో మనీలాండరింగ్ వ్యవహారంపై దృష్టి సారించారు. కెల్విన్, జీషాన్ ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలపైనే ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈడీ అధికారులు ఇప్పటి వరకు సేకరించిన సమాచారం ఆధారంగా మరికొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ కేసులో కెల్విన్‌పై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన ఎక్సైజ్‌శాఖ అధికారులు అతను చెప్పిన వివరాలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. సినీ ప్రముఖులకు డ్రగ్స్‌ విక్రయాలు సహా ఏ ఇతర ఆరోపణలకు బలమైన ఆధారాలు లేవని ఎక్సైజ్‌శాఖ ఛార్జ్​ షీట్‌లో పేర్కొంది. ఈ కేసు(Tollywood Drug case)లో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్‌, ఛార్మి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, నందు, రానా, రవితేజతోపాటు ఆయన డ్రైవర్‌ శ్రీనివాస్‌ను దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. డ్రగ్స్‌ సరఫరాదారులు కెల్విన్‌, వాహబ్‌తో సంబంధాలు, వారితో జరిపిన లావాదేవీలపై ఆరా తీయనున్నారు. ఎక్సైజ్‌ సిట్‌ నుంచి తీసుకున్న నివేధిక ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎక్సైజ్‌ సిట్‌ మాత్రం సినీ రంగానికి చెందిన వారందరికీ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. సినీ నటులు, హోటల్స్‌, విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ అమ్మినట్లు కెల్విన్ వాంగ్మూలం ఇవ్వగా... దాని ఆధారంగా పలువురికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించింది.

ఇదీ చూడండి:Tollywood Drug case : సినీ నటుడు తనీష్​ను విచారిస్తున్న ఈడీ అధికారులు

ABOUT THE AUTHOR

...view details