తెలంగాణ

telangana

ETV Bharat / state

శరత్, వినయ్‌బాబును ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన ఈడీ.. కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌ - ED produced accused in court in liquor scam case

దిల్లీ మద్యం కుంభకోణం కేసు
దిల్లీ మద్యం కుంభకోణం కేసు

By

Published : Nov 10, 2022, 2:43 PM IST

Updated : Nov 10, 2022, 3:16 PM IST

14:38 November 10

శరత్‌ చంద్రారెడ్డి, వినయ్‌బాబును 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ విజ్ఞప్తి

రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్న దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన శరత్‌ చంద్రారెడ్డి, వినయ్‌బాబులను ఈడీ అధికారులు దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. నిందితులను 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న అభిషేక్‌ బోయిన్‌పల్లిని ఇప్పటికే కటకటాల వెనక్కి నెట్టిన ఈడీ.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన మరో ఇద్దరిని నేడు అరెస్టు చేసింది. సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో శరత్‌ చంద్రారెడ్డిని ప్రశ్నించిన ఈడీ.. శరత్‌ చంద్రారెడ్డి సహా మరో మద్యం వ్యాపారి వినయ్‌ బాబును అరెస్టు చేసినట్లు తెలిపింది.

శరత్‌, వినయ్‌బాబుకు రూ.కోట్ల మద్యం వ్యాపారం ఉందని ఈడీ అధికారులు తెలిపారు. శరత్‌ చంద్రారెడ్డి అరబిందో ఫార్మా కంపెనీలో కీలక డైరెక్టర్‌గా ఉండటం సహా ఆ గ్రూపునకు చెందిన 12 కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తెలిపింది. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. మద్యం కుంభకోణంలో ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. దిల్లీ మద్యం పాలసీకి అనుగుణంగా శరత్ చంద్రారెడ్డి ఈఎండీలు చెల్లించారన్న అభియోగాలపై ఆయనను అరెస్టు చేసింది.

ఇవీ చూడండి..

Last Updated : Nov 10, 2022, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details