తెలంగాణ

telangana

ETV Bharat / state

తమిళనాడులో చిక్కిన సొమ్ముపై ఈడీ దృష్టి - తమిళనాడులో చిక్కిన సొమ్ముపై ఈడీ దృష్టి

తమిళనాడులో పట్టుబడిన రూ.5 కోట్లపై ఈడీ విచారించనుంది. చెన్నై పోలీసులు, ఐటీ అధికారులను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్ అధికారులు పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నగదు ఎక్కణ్నుంచి వచ్చాయోనని ఐటీ ఆరా తీస్తోంది.

ed to interrogate on chennai money laundering case
తమిళనాడులో చిక్కిన సొమ్ముపై ఈడీ దృష్టి

By

Published : Jul 27, 2020, 6:05 PM IST

తమిళనాడులో పట్టుబడిన రూ.5 కోట్లపై విచారణకు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్ రంగంలోకి దిగింది. చెన్నై పోలీసులు, ఐటీ అధికారులను ఈడీ వివరాలు కోరింది. ఏపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్టిక్కర్‌ ఉన్న కారులో పట్టుబడిన నగదు ఎక్కణ్నుంచి వచ్చాయోనని ఐటీ ఆరా తీస్తోంది. చెన్నైలో ఎవరికి ఇచ్చేందుకు నగదు తీసుకెళ్తున్నారన్న అంశంపై విచారిస్తున్నారు.

​ ఏపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కోడ్​ నంబర్​తో స్టిక్కర్​తో ఉన్న కారులో 5 కోట్ల రూపాయల నగదు చెన్నైలో చిక్కింది. ఒంగోలుకు చెందిన వ్యాపారి ఈ నగదుతో పోలీసులకు చిక్కాడు. ఒంగోలు నుంచి చెన్నై వెళ్తున్న కారులో చెక్​పోస్టు వద్ద చేసిన తనిఖీల్లో ఈ నగదు చిక్కింది.

ఈ డబ్బు ఎవరిది అనే అంశంపై కొన్ని రోజుల క్రితం తీవ్ర సంచలనమైంది. అన్నా రాంబాబు స్టిక్కర్‌ ఉన్న కారులో పట్టుబడిన నగదు ఎక్కణ్నుంచి వచ్చాయోనని ఐటీ ఆరా తీస్తోంది. కాగా ఈ ఆ స్టిక్కర్‌ నకిలీదని వైకాపా ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు.

ఇవీ చూడండి-కరోనాకు మందు అంటూ మోసం..'కరోనా షట్ ఔట్-మేడిన్ జపాన్' పేరుతో విక్రయం

ABOUT THE AUTHOR

...view details