Nandakumar ED Enquiry: చంచల్‌గూడ జైలులో ఉన్న నందకుమార్ విచారణ ముగిసింది. ఎమ్మెల్యే ఎర కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు రోజుల పాటు విచారించనుంది. అందులో భాగంగా మెుదటి రోజు విచారణ పూర్తైంది. ఆయనను సుమారు 5 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణ ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్ గోయల్, దేవేందర్ సింగ్, వీర నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఎమ్మెల్యేలకు ఎర కేసుతో పాటు రోహిత్‌రెడ్డితో సంబంధాలు, వ్యాపార లావాదేవీలపై ఆరా తీశారు. నందకుమార్‌పై ఉన్న కేసుల వివరాలను సేకరించారు.
'రోహిత్‌రెడ్డితో మీకు ఎప్పటి నుంచి పరిచయం..?' - What did the ED officials ask Nandakumar
Nandakumar ED Enquiry: చంచల్‌గూడ జైలులో ఉన్న నందకుమార్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల మెుదటి రోజు విచారణ ముగిసింది. సుమారు ఐదు గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణలో ఎమ్మెల్యేలకు ఎర కేసుతో పాటు రోహిత్‌రెడ్డితో ఉన్న వ్యాపార సంబంధాలను ఆరా తీశారు.
బంజారాహిల్స్‌లోని ఓ భూ వ్యవహరంలో మధ్యవర్తిగా వ్యవహరించిన నందకుమార్.. భూమిని కాజేయాలని దురుద్దేశ్యంతో ఆ యజమానిని వేధింపులకు గురిచేసినట్లు కేసు నమోదైంది. దీని ఆధారంగా మనీలాండరింగ్ యాక్ట్ కింద నిందితుడిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా విచారించేందుకు అనుమతివ్వాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. అసిస్టెంట్ డైరెక్టర్‌తో పాటు మరో ఇద్దరు విచారణ జరిపేందుకు న్యాయస్థానం అంగీకరించింది. కోర్టు అనుమతి మేరకు చంచల్‌గూడ జైలుకు వెళ్లిన ఈడీ అధికారులు.. ఆయనను ప్రశ్నించారు. విచారణ కోసం కారాగారంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో దర్యాప్తు జరిపారు. అధికారులు రేపు మరోసారి నందకుమార్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.
ఇవీ చదవండి: