తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసు... ఈడీ విచారణకు గ్రానైట్ వ్యాపారులు - ed on granite traders

ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో ఈడీ.. గ్రానైట్ వ్యాపారులను విచారిస్తోంది. ఈడీ కార్యాలయానికి హాజరైన నలుగురు గ్రానైట్‌ వ్యాపారులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. పన్నులు ఎగ్గొట్టేందుకు గ్రానైట్‌ ఎగుమతిని తక్కువగా చూపినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ED is questioning granite traders in case of violation of FEMA norms
ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసు

By

Published : Nov 21, 2022, 3:53 PM IST

Updated : Nov 21, 2022, 4:23 PM IST

ఈడీ విచారణకు గ్రానైట్ వ్యాపారులు హాజరయ్యారు. ఈడీ కార్యాలయానికి నలుగురు గ్రానైట్‌ వ్యాపారులు చేరుకున్నారు. ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో వ్యాపారులను ఈడీ ప్రశ్నిస్తుంది. పన్నులు ఎగ్గొట్టేందుకు గ్రానైట్‌ ఎగుమతిని తక్కువగా చూపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రూ.124 కోట్లు పన్నులు ఎగ్గొట్టారని గ్రానైట్ కంపెనీలపై ఆరోపణలు వచ్చాయి.

2013లో అప్పటి ప్రభుత్వానికి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదిక సమర్పించింది. ఇటీవల 8 గ్రానైట్ కంపెనీల్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు... సోదాల ఆధారంగా వ్యాపారులను విచారణకు ఈడీ పిలిచింది. తనిఖీల్లో లభించిన ఆధారాలపై ఈడీ అధికారుల విచారణ జరుగుతోంది.

ఇవీ చూడండి:

Last Updated : Nov 21, 2022, 4:23 PM IST

ABOUT THE AUTHOR

...view details