తెలంగాణ

telangana

ETV Bharat / state

చీకోటి ప్రవీణ్‌ క్యాసినో కేసు.. తలసాని పీఏపై ఈడీ ప్రశ్నలవర్షం - Thalasani PA Ashok Latest News

ED Investigation on Casino Case: చీకోటి ప్రవీణ్‌ క్యాసినో కేసులో ఈడీ ముమ్మర విచారణ చేపట్టింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పీఏ అశోక్‌ను 8 గంటల పాటు ప్రశ్నించింది. విదేశీ ప్రయాణాలు, ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీసింది.

ED Investigation on Casino Case
ED Investigation on Casino Case

By

Published : Dec 12, 2022, 3:34 PM IST

Updated : Dec 12, 2022, 10:49 PM IST

ED Investigation on Casino Case: క్యాసినో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యక్తిగత సహాయకుడు అశోక్‌ను ఈడీ అధికారులు 8 గంటల పాటు విచారించారు. విదేశీ ప్రయాణాలు, ఆర్థిక లావాదేవీలు.. చీకోటి ప్రవీణ్‌తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. అశోక్‌ బ్యాంకు స్టేట్‌మెంట్‌ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.

క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ బ్యాంకు ఖాతాలను పరిశీలించిన ఈడీ అధికారులు.. పలు అనామానాస్పద లావాదేవీలు గుర్తించారు. నేపాల్‌లో ఈ ఏడాది జనవరి, జూన్‌లలో చీకోటి ప్రవీణ్ రెండుసార్లు క్యాసినో నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి నేపాల్‌కు తీసుకెళ్లాడు. హైదరాబాద్ నుంచి నేపాల్‌కు.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు నగదు లావాదేవీల విషయంలో ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో ఈడీ అధికారులు ప్రవీణ్‌తో పాటు నేపాల్‌కు వెళ్లిన పలువురిని ప్రశ్నించారు. మంత్రి తలసాని సోదరులు మహేశ్‌, ధర్మేంద్ర యాదవ్, పీఏ హరీశ్‌ను ఈడీ అధికారులు గత నెల ప్రశ్నించారు.

Last Updated : Dec 12, 2022, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details