రాష్ట్రంలో సంచలనం సృష్టించిన క్యాసినో వ్యవహారంలో చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి, సంపత్‌లను ఈడీ సుదీర్ఘంగా విచారించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు వీరిని ఈడీ అధికారులు విచారించారు. విదేశాల్లో నిర్వహించిన క్యాసినో, ఈవెంట్స్ లావాదేవీలు, పెద్ద మొత్తంలో విదేశీ మారకద్రవ్యం దారి మళ్లించడం, బ్యాంకు ఖాతాల వివరాలు, వంటి అంశాలపై ప్రవీణ్ బృందాన్ని ఈడీ అధికారులు విచారించారు. అయితే విచారణలో ప్రవీణ్ తడబడ్డట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రవీణ్ బృందాన్ని ఈడీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరికొంతమంది క్యాసినో ఏజెంట్లతో పాటు ఇంకొందరికి ఈడీ తాఖీదులు జారీ చేయనున్నట్టు సమాచారం.
క్యాసినో కేసు నిందితులకు ముగిసిన ఈడీ విచారణ - ED investigation of the accused in the casino case is over
క్యాసినో కేసు నిందితులకు ముగిసిన ఈడీ విచారణ
21:45 August 01
క్యాసినో కేసు నిందితులకు ముగిసిన ఈడీ విచారణ
Last Updated : Aug 1, 2022, 10:25 PM IST