తెలంగాణ

telangana

ETV Bharat / state

ED Charge Sheet In Telangana ESI Scam Case : ఈఎస్​ఐ కుంభకోణం.. ఛార్జిషీట్​ దాఖలు చేసిన ఈడీ - ఈఎస్​ఐ కుంభకోణం కేసు అప్​డేట్

ED Charge Sheet In Telangana ESI Scam Case : ఈఎస్​ఐ కుంభకోణం కేసులో ఈడీ అభియోగ పత్రాలు దాఖలు చేసింది. ఇన్సూరెన్స్​ మెడికల్​ సర్వీసెస్​లో రూ.211 కోట్ల స్కామ్​కు సంబంధించి.. మొత్తం 16 మందికి ఈడీ ఛార్జిషీట్​ దాఖలు చేసింది. 2019లో తెలంగాణ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్​ ఆధారంగా మనీలాండరింగ్​ కేసును ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ నమోదు చేసింది.

Telangana ESI Scam Case
ED Filed Charge Sheets In Telangana ESI Scam Case

By ETV Bharat Telangana Team

Published : Aug 25, 2023, 7:55 PM IST

ED Charge Sheet In Telangana ESI Scam Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్​ఐ కుంభకోణం(ESI Scam) కేసులో ఈడీ అభియోగపత్రాలు దాఖలు చేసింది. ఇన్సూరెన్స్​ మెడికల్​ సర్వీసెస్(Insurence Medical Service)​లో రూ.211 కోట్ల స్కామ్​కు సంబంధించి.. మాజీ డైరెక్టర్​ దేవికా రాణితో పాటు 15 మందిపై ఈడీ కోర్టులో ఛార్జిషీట్​ దాఖలు చేసింది. గతంలో నిందితులకు సంబంధించిన రూ.144 కోట్ల ఆస్తులను కూడా ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ జప్తు చేసింది. 2019లో తెలంగాణ ఏసీబీ(ACB) నమోదు చేసిన తొమ్మిది ఎఫ్​ఐఆర్​ల ఆధారంగా మనీలాండరింగ్ కేసును నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేస్తుంది.

తాజాగా నమోదు చేసిన ఛార్జిషీట్​లో దేవికారాణి, ఐఎంఎస్​ సిబ్బంది, మందులు, కిట్లు సరఫరా చేసే శ్రీహరిబాబు సహా పలువురి పేర్లను చేర్చింది. మందులు, మెడికల్​ కిట్లను సరఫరా చేసే కంపెనీలతో కుమ్మక్కై అధిక రేట్లకు కొనుగోలు చేసి.. బిల్లును సైతం నిందితులు తారుమారు చేసి కోట్ల రూపాయలు కాజేసినట్లు ఈడీ ఆధారాలను సేకరించింది. మెడికల్​ క్యాంపులు నిర్వహించి కూడా అవకతవకలకు పాల్పడినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది.

ఈఎస్​ఐ కుంభకోణం.. కోట్లు కొల్లగొట్టారు..!

అసలు ఏం జరిగిందంటే..? ఈఎస్​ఐ మందుల కొనుగోలు కుంభకోణం కేసులో.. గత ఐదేళ్ల కాలంలో బీమా వైద్య సేవల ద్వారా సుమారు రూ.1000 కోట్లు ఖర్చు పెట్టగా.. వాటిలో రూ.200 కోట్ల వరకు సొమ్మును అధికారులు, సిబ్బంది, ప్రైవేటు వ్యక్తులు కలిసి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా దోచుకున్నారు. దీనిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దర్యాప్తు చేసింది. ఏసీబీ నుంచి కేసు మనీలాండరింగ్​ జరగడంతో ఎన్​ఫోర్స్​మెట్​ డైరెక్టరేట్​ ఎంట్రీ ఇచ్చింది.

Telangana ESI Scam Case Update : ఒక్కొక్కటిగా ఈఎస్​ఐ స్కాం లింక్​లను బయటపెడుతూ.. నిందితుల ఆస్తులను జప్తును చేశాయి. ఈ క్రమంలో ఈఎస్​ఐ ఔషధాల కొనుగోలులో కీలకపాత్ర పోషించిన ఐదుగురు నిందితులకు సంబంధించిన రూ.144 కోట్లను కూడా అటాచ్​ చేశారు. ఈఎస్​ఐ మాజీ డైరెక్టర్ డాక్టర్ దేవికారాణి, మాజీ జేడీ పద్మ, ఫార్మసిస్టు నాగలక్ష్మి, ఓమ్ని గ్రూపు డైరెక్టర్ కె.శ్రీహరిబాబు, పందిరి రాజేశ్వర్​రెడ్డి ఆస్తులను తాత్కాలిక జప్తు చేసింది.

'ఈఎస్​ఐ డైరెక్టరేట్​ కుంభకోణాలకు నిలయం'

ఈఎస్​ఐ మాజీ డైరెక్టర్​ దేవికారాణికి చెందిన రూ.17.26 కోట్ల విలువైన ఆస్తులు.. నాగలక్ష్మికి చెందిన రూ.2.45 కోట్ల ఆస్తులు, పద్మకు చెందిన రూ.74.08 లక్షల విలువైన ఆస్తులను అటాచ్​ చేశాయి. వీరితో పాటు ఓమ్ని గ్రూపు డైరెక్టర్​ శ్రీహరిబాబుకు చెందిన రూ.119.89 కోట్ల.. పందిరి రాజేశ్వర్​ రెడ్డికి చెందిన రూ.4.07 లక్షల విలువైన ఆస్తులను జప్తు చేశారు. అంతకు ముందు ఐఎంఎస్​ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ఏసీబీ అధికారులు ఎనిమిది కేసులు నమోదు చేసి.. దర్యాప్తు చేశారు. ఈ అధికారులు ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా.. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సుమారు రూ.211 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు అవినీతి నిరోధక శాఖ అభియోగాలు నమోదు చేసింది. ఇక్కడ వాస్తవ ధర కన్నా నాలుగు లేదీ ఐదింతలు ఎక్కువగా కొనుగోలు చేసి.. అక్రమంగా భారీగా కొనుగోలు చేశారు.

డొల్ల కంపెనీలతో రూ.3 కోట్ల బంగారు ఆభరణాలు కొనుగోలు

ఈఎస్​ఐ కుంభకోణంలో కదులుతున్న డొంక...!

ABOUT THE AUTHOR

...view details