తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొవిడ్ బారిన పడకముందే దేశీయ సంస్థలు అప్పుల బారిన పడ్డాయి' - modi declare package

దేశ వ్యాప్తంగా ప్రభుత్వం లాక్​డౌన్ విధించిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. తిరిగి దానిని గాడినపెట్టేందుకు కేంద్రం రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీతో ఏ వర్గాలు ఉపశమనం పొందనున్నాయి? అసలు పూర్తిగా ఆర్థిక ప్యాకేజీ విడుదల అవుతుందో లేదో అంటున్న ఆర్థిక విశ్లేషకుడు పాపారావుతో ముఖాముఖి.

economy-specialist-paparao-about-nirbara-abhiyan-package
'కొవిడ్ బారిన పడకముందే దేశీయ సంస్థలు అప్పుల బారిన పడ్డాయి'

By

Published : May 13, 2020, 1:09 PM IST

Updated : May 13, 2020, 2:54 PM IST

ప్ర. మోదీ ప్రకటించిన ప్యాకేజీలో 20 లక్షల కోట్లు ఏ విధంగా ఏ రంగానికి తోడ్పాటు అవుతోంది?

జ. దేశం స్వాలంభన కోసమే ప్రధాని ఆత్మ నిర్భర అభియాన్ తెచ్చారు. దానిలో భాగంగానే 20 లక్షల కోట్ల ప్యాకేజీని మోదీ ప్రకటించారు. ఈ ఆర్థిక ప్యాకేజీ పూర్తిగా విడుదల అవుతుందా లేదా అనేది తెలియాలి. గతంలో ఆర్​బీఐ ప్రకటించిన 1.75 లక్షల కోట్లు, నిర్మలా సీతారామన్ ప్రకటించిన 4.25 లక్షల కోట్లను కలిపి... ఈ ప్యాకేజీ నుంచి మొత్తం తొలగిస్తారా లేదా అనే విషయం తెలియాలి.

విదేశీ సంస్థలు భారత్​లో నష్టాల్లో ఉన్న స్వదేశీ సంస్థలను కొనుకుంటున్నప్పుడు... దేశీయ కంపెనీలు విదేశాలకు అమ్ముడు పోయినప్పుడు ఇది స్వదేశీ ఎలా అవుతుందనేది ప్రశ్న. స్వదేశీ ఉత్త్పత్తిదారులు బలంగా ఉండగలగటం ప్రాధాన్యం కలిగిన అంశం. ఇది నిజంగా నేరవేరుతుందా..? కొవిడ్ రాకముందే స్వదేశీ సంస్థలు... విదేశీ సంస్థలకు అప్పులు పడి ఉన్నాయి. కొవిడ్ అనంతర కాలంలో కార్పొరేట్ సంస్థలు వీటి విదేశీ సంస్థలకు అప్పుల భారం మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిని తీవ్ర పరిణామంగా పరిగణించాల్సిన అవసరముంది.

ప్ర. చిన్న, మధ్య తరహ, వ్యవసాయరంగంపై ఈ ప్రాజెక్టు ఎంత వరకు ప్రభావం చూపుతోంది?

జ. రైతుల ఆదాయం పెరిగేందుకు ప్యాకేజీ ఎలా ఉపయోగపడుతుందో చూడాలి. విద్యుత్ ధరలు తగ్గించి... వ్యవసాయ పరికరాలు తక్కువ ధరకు అందించాలి. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు తక్కువ ధరకు వచ్చేలా చూడాలి.

ప్ర. కుల వృత్తులకు ఈ ప్యాకేజీ ఎంత వరకు మేలు చేస్తోంది?

జ. గతం నుంచి కుల వృత్తులకు సంక్షోభం ఉంది. కాబట్టి ఈ ప్యాకేజీలో వాటిని పదిలం చేసుకోగలమా? లేదో చూసుకోవాలి.

'కొవిడ్ బారిన పడకముందే దేశీయ సంస్థలు అప్పుల బారిన పడ్డాయి'
Last Updated : May 13, 2020, 2:54 PM IST

ABOUT THE AUTHOR

...view details