ప్రస్తుతం ఎదుర్కొంటున్న నీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని మహీంద్ర ఆటోమోటివ్ సర్వీసింగ్ సెంటర్లలో ఎకో వాష్ పద్ధతిని ప్రారంభించారు. హైదరాబాద్ మెహదీపట్నం పిల్లర్ నంబర్ 86 వద్ద డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్ చేతుల మీదుగా ఈ ప్రయోగాత్మక కెమికల్ వాషింగ్‌ను ప్రారంభించారు.
వాహనాలకు ఇక 'ఎకోవాష్'... నీరు ఆదా, ధర తక్కువ... - ECO WASH STARTED IN MAHENDRA SERVICING CENTERS IN HYDERABAD
నీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని మహీంద్ర ఆటోమోటివ్ సర్వీసింగ్ సెంటర్లలో ప్రయోగాత్మకంగా ఎకోవాష్ పద్ధతికి శ్రీకారం చుట్టారు. సుమారు ఒక్క లీటరు నీటితోనే వాహనాలను వాష్ చేయటమే కాకుండా... తక్కువ ధరనే వసూలు చేయటం గమనార్హం.
![వాహనాలకు ఇక 'ఎకోవాష్'... నీరు ఆదా, ధర తక్కువ... ECO WASH STARTED IN MAHENDRA SERVICING CENTERS IN HYDERABAD](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5944251-thumbnail-3x2-ppp.jpg)
ECO WASH STARTED IN MAHENDRA SERVICING CENTERS IN HYDERABAD
మహీంద్ర సంస్థ యాజమాన్యం ఏకో వాష్ మొదలుపెట్టటం హర్షించదగ్గ విషయమని డిప్యూటీ మేయన్ బాబా ఫసియోద్దీన్ తెలిపారు. ఈ పద్ధతి వల్ల సుమారు 50 నుంచి 70 లీటర్ల నీటిని పొదుపు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. సాధారణ వాటర్ వాష్‌కు తీసుకునే డబ్బులే కెమికల్ వాష్కూ తీసుకుంటామని నిర్వాహకులు పేర్కొన్నారు.
వాహనాలకు ఇక 'ఎకోవాష్'... నీరు ఆదా, ధర తక్కువ...