పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరు మట్టిగణపతులనే పూజించాలని సికింద్రాబాద్ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు ఉప్పలనచ్చి గీత అన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు కార్ఖానా వాసవీనగర్లో మట్టిగణపతులను పంపిణీ చేశారు.
'మట్టిగణపతిని పూజిద్దాం..పర్యావరణాన్ని రక్షిద్దాం' - eco friendly ganesh idol distribution in secundrabad
వినాయక చవితి సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ 5వ వార్డులో ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మట్టిగణపతుల విగ్రహాలు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరు మట్టిగణపతులనే పూజించాలని సంఘం అధ్యక్షురాలు ఉప్పలనచ్చి గీత అన్నారు.
సికింద్రాబాద్లో మట్టిగణపతుల పంపిణీ
ఆర్యవైశ్య మహిళా సంఘం స్ఫూర్తితో ప్రజలంతా గణేశ్ ఉత్సవాలను ఇంట్లోనే జరుపుకోవాలని వాసవీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీశ్ గుప్త సూచించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు రమారాణి, పలువురు మహిళలు పాల్గొన్నారు.