రాష్ట్రంలో కరోనా పరిస్థితుల మధ్య పలుమార్లు వాయిదా పడిన ప్రవేశ పరీక్షలు.. సోమవారం ఈసెట్‌తో ప్రారంభమయ్యాయి. పాలిటెక్నిక్ డిప్లొమా చదివిన విద్యార్థులు.. ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరేందుకు.. జేఎన్టీయూహెచ్ ఇవాళ ఆన్లైన్ విధానంలో ఈసెట్ నిర్వహించింది. ఈసెట్ కోసం తెలంగాణలో 52, ఏపీలో 4 కేంద్రాల్లో సుమారు 25 వేల మంది హాజరయ్యారు.
కరోనా వేళ.. రాష్ట్రంలో 52 కేంద్రాల్లో ఈసెట్ పరీక్ష - ecet exam in telangana conducted successfully
కరోనా విపత్కర పరిస్థితుల మధ్య రాష్ట్రంలో సోమవారం ఈసెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈసెట్ కోసం తెలంగాణలో 52, ఏపీలో 4 కేంద్రాల్లో సుమారు 25 వేల మంది హాజరయ్యారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా అధికారులు కట్టడి నిబంధనలు పాటిస్తూనే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోని అనుమతించారు.
![కరోనా వేళ.. రాష్ట్రంలో 52 కేంద్రాల్లో ఈసెట్ పరీక్ష ecet examination held in telangana state](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8627194-665-8627194-1598878336378.jpg)
కరోనా వేళ.. రాష్ట్రంలో 52 కేంద్రాల్లో ఈసెట్ పరీక్ష
కరోనా నేపథ్యంలో కేంద్రాల వద్ద అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీనింగ్ చేసి.. కొవిడ్ నెగిటివ్ డిక్లరేషన్ చూపించాకే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. కేంద్రాల్లోకి మంచినీటి బాటిల్, శానిటైజర్, గ్లౌజులు, మాస్కులను అనుమతించారు. మాస్కులు లేని విద్యార్థులకు కేంద్రాల్లో మాస్కులు అందించారు. థర్మల్ స్క్రీనింగ్‌లో ఉష్ణోగ్రత ఎక్కువ వచ్చిన విద్యార్థులకు ప్రత్యేక గదిలో పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు.