తెలంగాణ

telangana

ETV Bharat / state

జులై 4న ఈసెట్​ పరీక్ష.. అందుబాటులోకి హాల్​టికెట్లు - ఈసెట్​ పరీక్ష తేది 2020

జులై 4న ఉదయం 9 నుంచి 12 వరకు.. మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు రెండు సెషన్లలో ఆన్​లైన్లో అర్హత పరీక్ష ఉంటుందని కన్వీనర్​ మన్​జూర్​ హుస్సేన్​ తెలిపారు. ఈనెల 30 వరకు హాల్ టికెట్లు డౌన్​లోడ్ చేసుకోవచ్చునని కన్వీనర్ పేర్కొన్నారు.

Ecet Exam on July 4. Hall tickets  are available
జులై 4న ఈసెట్​ పరీక్ష.. అందుబాటులోకి హాల్​టికెట్లు

By

Published : Jun 28, 2020, 4:48 AM IST

ఈసెట్​ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కన్వీనర్​ మన్​జూర్​ హుస్సేన్​ తెలిపారు. పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులకు ఇంజినీరింగ్ రెండో సంవత్సరం ప్రవేశాల కోసం జులై 4న ఉదయం 9 నుంచి 12 వరకు.. మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు రెండు సెషన్లలో ఆన్​లైన్లో అర్హత పరీక్ష ఉంటుందని వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా 27,993 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు మన్​జూర్​ హుస్సేన్ పేర్కొన్నారు. శనివారం నుంచి హాల్​టికెట్లు అందుబాటులో ఉంచామన్నారు. తొలి రోజే 22,864 మంది అభ్యర్థులు డౌన్​లోడ్ చేసుకున్నారని తెలిపారు. ఈనెల 30 వరకు హాల్ టికెట్లు డౌన్​లోడ్ చేసుకోవచ్చునని కన్వీనర్ పేర్కొన్నారు.

ఆన్​లైన్ అర్హత పరీక్షపై అభ్యర్థుల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 25న మాక్ టెస్టులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:సీబీఎస్​ఈ ఫైనల్​ మార్కులు లెక్కిస్తారిలా...

ABOUT THE AUTHOR

...view details