తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజకీయ పార్టీల కీలక నేతలతో ఈసీ కార్యశాల

లోక్ సభ ఎన్నికల కోసం ఈసీ అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నేతలతో వర్క్ షాప్ నిర్వహించింది.  ఈవీఎంలు, వీవీప్యాడ్​లపై నెలకొన్న అనుమానాలు, ఎన్నికల నిబంధనల అమలుపై నేతల  అనుమానాలను సీఈవో రజత్ కుమార్ నివృత్తి చేశారు.

రాజకీయ పార్టీల కీలక నేతలతో ఈసీ కార్యశాల

By

Published : Mar 20, 2019, 10:41 PM IST

రాజకీయ పార్టీల కీలక నేతలతో ఈసీ కార్యశాల
పార్లమెంట్​ ఎన్నికలు సమీపిస్తున్నందున ఎన్నికల కమిషన్ వేగం పెంచింది. ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఓటింగ్ పెంచే ప్రయత్నాలు చేస్తోంది. అన్ని రాజకీయ పార్టీల ముఖ్యనేతలతో బేగంపేట్ లోని హరితప్లాజాలో సమావేశం నిర్వహించింది. కార్యక్రమంలో ఎన్నికల నియమావళి, నియమ నిబంధనలపై రాజకీయపార్టీల నేతలు అడిగిన ప్రశ్నలకు రజత్ కుమార్ సమాధానమిచ్చారు. ఎన్నికలు ప్రశాంత వాతారణంలో ప్రజాస్వామ్యయుతంగా కొనసాగేందుకు అన్నిపార్టీలు సహకరించాలని సీఈవో కోరారు. పలు రాజకీయపార్టీల నేతలు ఈవీఎంలు, వీవీప్యాడ్​లపై సందేహాలను వ్యక్తపరిచారు. ఓటు వేసిన తర్వాత వీవీప్యాడ్​లలో కేవలం ఐదు సెకండ్లు మాత్రమే కన్పిస్తున్నాయని, చీకట్లో ఈవీఎంలు సరిగా కన్పించడం లేదని తెదేపా నేతలు సీఈవో రజత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల కోడ్​ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోండి

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా హైటెక్ సిటీ మెట్రో మార్గం ప్రారంభంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వీవీప్యాడ్​ల విషయంలో ప్రజల అనుమానాలు నివృత్తి చేయాలని, 50శాతం వీవీప్యాడ్​లు లెక్కించాలని ఆ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్​ చేశారు.నేతలు ఇచ్చిన సలహాలు, సూచనలను సీఈవో స్వీకరించారు. ఎన్నికల నియమావళిని, నిబంధనలను కచ్చితంగా అమలుచేయాలని అన్ని పార్టీలను కోరారు.

ABOUT THE AUTHOR

...view details