తెలంగాణ

telangana

ETV Bharat / state

EC Transfers Several Collectors and SPs In Telangana : 20 మంది అధికారులపై ఈసీ వేటు.. ఎన్నికల విధుల నుంచి వారంతా ఔట్ - హైదరాబాద్ తాజా వార్తలు

EC Transfers Several Collectors and SPs In Telangana : ఫిర్యాదులు, పనితీరు, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎన్నికల సంఘం 20 మంది అధికారులపై బదిలీ వేటు వేసింది. నలుగురు కలెక్టర్లు, ముగ్గురు పోలీస్ కమిషనర్లు, పది మంది ఎస్పీలు సహా ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను విధుల నుంచి తప్పించింది. శాసనసభ ఎన్నికలు ముగిసే వరకు సదరు అధికారులకు ఎన్నికల విధులు అప్పగించవద్దన్న ఈసీ.. కొత్త వారి కోసం సాయంత్రంలోపు ప్యానల్ పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు ముగ్గురు పోలీసు కమిషనర్లు, 10 మంది ఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..

EC Focus on Telangana Assembly Elections 2023
EC Transfers Several Collectors and SPs In Telangana

By ETV Bharat Telangana Team

Published : Oct 12, 2023, 7:13 AM IST

Updated : Oct 12, 2023, 10:55 AM IST

EC Transfers Several Collectors and SPs In Telangana : 20 మంది అధికారులపై ఈసీ వేటు.. ఎన్నికల విధుల నుంచి వారంతా ఔట్

EC Transfers Several Collectors and SPs In Telangana: ఎన్నికల నిర్వహణ, సన్నద్ధతపై హైదరాబాద్‌లో నిర్వహించిన మూడు రోజుల సమీక్ష సందర్భంగా అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. తాజాగా కొంత మంది అధికారులపై కొరడా ఝులిపించింది. సమీక్ష సందర్భంగా కొందరు కలెక్టర్లు, పోలీస్ అధికారుల పనితీరు, వారిపై వచ్చిన ఫిర్యాదుల విషయమై ఈసీ తీవ్రంగా స్పందించింది. కొందరిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు.

EC Focus on Telangana Assembly Elections 2023 : గతంలో ఎన్నికల సమయంలో ఎలా పనిచేశారో తమకు పూర్తి అవగాహన ఉందని కూడా కొందరు కలెక్టర్లు, పోలీసు అధికారులను ఉద్దేశించి ఎన్నికల కమిషనర్లు వ్యాఖ్యానించారు. దాంతో కొందరిపై ఈసీ చర్యలు తీసుకుంటుందని అప్పట్లోనే వినిపించింది కూడా. సోమవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. బుధవారం అధికారులపై బదిలీ వేటు వేసింది. జిల్లా ఎన్నికల అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న నలుగురు కలెక్టర్లతో పాటు ముగ్గురు పోలీస్ కమిషనర్లు, పది మంది ఎస్పీలపై వేటు పడింది. అధికారుల పనితీరు, వారిపై వచ్చిన ఫిర్యాదులు, గతంలో జరిగిన ఎన్నికల సందర్భంగా వ్యవహరించిన తీరు, వారి హయాంలో నియమావళి అమలు, డబ్బు, మద్యం తదితరాల స్వాధీనం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని అయా అధికారులను బదిలీ చేశారు.

Hyderabad CP CV Anand Transferred 2023 :బదిలీ అయిన వారిలో రంగారెడ్డి కలెక్టర్ హరీష్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి ఉన్నారు. హైదరాబాద్ పోలిస్ కమిషనర్ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ బదిలీ అయ్యారు. సూర్యాపేట ఎస్పీగా ఉన్న ఐపీఎస్ అధికారి రాజేంద్రప్రసాద్ తో పాటు... తొమ్మిది మంది నాన్ కేడర్ ఎస్పీలను బదిలీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు వారికి ఎలాంటి ఎన్నికల సంబంధిత విధులు అప్పగించవద్దని ఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, వాణిజ్యపన్నులశాఖ కమిషనర్ టీకేశ్రీదేవి, ఎక్సైజ్ శాఖ సంచాలకులు ముషారఫ్ అలీ బదిలీ అయ్యారు.

ECI Shunts 20 Officers in Telangana : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..అదనంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎక్సైజ్, వాణిజ్యపన్నుల శాఖలకు విడిగా ముఖ్యకార్యదర్శులను నియమించాలని కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సమయంలో సీఎస్ వద్దే రెండు శాఖలు ఉంటే ఇబ్బంది అవుతుందని..వేరే వారికి అప్పగించాలని స్పష్టం చేసింది. బదిలీ అయిన వారి స్థానాల్లో కొత్త వారిని నియమించేందుకు వీలుగా సాయంత్రంలోగా ప్యానల్ పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గత ఐదేళ్లుగా వారి వార్షిక నివేదికలను కూడా పంపాలని తెలిపింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు అధికారుల చొప్పున పేర్లను ఈసీకి పంపాల్సి ఉంటుంది. అందులో ఒకరిని కేంద్ర ఎన్నికల సంఘం నియామకం చేస్తుంది. తొమ్మిది మంది నాన్ కేడర్ ఎస్పీలను బదిలీ చేసిన ఈసీ..ఎస్పీలుగా ఐపీఎస్‌ల పేర్లు మాత్రమే పంపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

EC Focus on Critical Constituencies in Telangana : ఆ నియోజకవర్గాలపై ఈసీ స్పెషల్​ ఫోకస్​.. రాష్ట్రానికి త్వరలో పరిశీలకులు

ఇంత మంది అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయడం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికల వేళ భారీస్థాయిలో యూనిట్‌ అధికారులను మార్చిన దాఖలాలు గతంలో లేకపోవడం సంచలనం కలిగిస్తోంది. ఒకరకంగా దేశంలోనే ఈ స్థాయిలో మార్చిన సందర్భాలు లేవనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి నలుగురు కమిషనర్లతోపాటు తొమ్మిది మంది ఎస్పీలను మార్చాలన్న కమిషన్‌ ఆదేశం ఉన్నతాధికారులనే ఆశ్చర్యానికి గురిచేసింది. కీలకమైన హైదరాబాద్‌ కమిషనర్‌ సీవీఆనంద్‌ను ఆకస్మికంగా బదిలీ చేయడం కలకలం రేపింది. ఈ స్థానంలో ఎవరిని నియమిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

CEC Removes 20 Officers From Election Duty Telangana : మరోవైపు వరంగల్, నిజామాబాద్‌ కమిషనర్లతోపాటు పలు జిల్లాల ఎస్పీలను ఒకేసారి మార్చడం హాట్‌టాపిక్‌గా మారింది. వాస్తవానికి ఇటీవలే నిర్వహించిన సమీక్షలో పోలీస్‌శాఖపై ఎన్నికల కమిషన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నగదు, మద్యం ప్రవాహం భారీగా సాగినా జప్తు విషయంలో ఉదాసీనంగా ఉన్నట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల్లో ప్రలోభాలను నియంత్రించే విషయంలో ఉన్నతాధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్లలో తప్పిదాలను ఎత్తిచూపింది. ప్రత్యేకించి హుజురాబాద్, మునుగోడు ఉపఎన్నికల సమయంలో పోలీస్‌శాఖ వ్యవహారశైలిపై మండిపడింది. పెద్దఎత్తున ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా నియంత్రించడంలో పోలీస్‌శాఖ విఫలమైనట్లు స్పష్టం చేసింది.

EC Focus on Telangana Assembly Elections 2023: గతంలో ఎన్నడూలేని రీతిలో జరిగిన ఈ సమీక్ష తీరుపై పోలీస్‌శాఖలో విస్తృతంగా చర్చ జరిగింది. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు సైతం కమిషనర్లు, ఎస్పీల పనితీరును దుయ్యబడుతూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేశారు. పలు యూనిట్ల అధికారులు అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి కొన్ని ఉదంతాలను ఉదహరించాయి. ఈనేపథ్యంలోనే తాజాగా భారీసంఖ్యలో యూనిట్‌ అధికారులను మార్చడం చర్చనీయాంశంగా మారింది.

Telangana Assembly Elections 2023 : ఎన్నికల కమిషన్ బదిలీ చేసిన వాళ్ల స్థానంలో కొత్త కమిషనర్లు, ఎస్పీల నియామక ప్రక్రియపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంపే జాబితాపై ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి ఇప్పుడు మార్చిన జిల్లా ఎస్పీలంతా నాన్‌కేడర్‌ ఎస్పీలే కావడం గమనార్హం. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు వీరిని లూప్‌లైన్‌కు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పలువురు డైరెక్ట్ ఐపీఎస్‌లున్నా చాలామందిని లూప్‌లైన్‌కే పరిమితం చేశారు. దీంతో ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం పంపే తాజా జాబితాలో వీరికి అవకాశం కల్పిస్తారా అనే చర్చ సాగుతోంది. రానున్న రోజుల్లో ఈసీ ఇంకా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని, ఇంకా కొంత మందిని కూడా బదిలీ చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

EC Focus on Telangana Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ ఫోకస్.. విచ్చలవిడి వ్యయానికి అడ్డుకట్ట వేసేందుకు పక్కా ప్లాన్

Central Election Commission Telangana Tour : ప్రలోభాల అడ్డుకట్టతోనే పారదర్శకంగా ఎన్నికలు.. అధికారులకు ఈసీ కీలక ఆదేశాలు

Last Updated : Oct 12, 2023, 10:55 AM IST

ABOUT THE AUTHOR

...view details