శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై... కేంద్ర ఎన్నికల సంఘం (CEC).. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, మహ్మద్ ఫరీదుద్దీన్, ఆకుల లలిత... పదవీకాలం జూన్ మూడో తేదీతో ముగిసింది.
EC: ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాన్ని కోరిన ఈసీ - Cec letter to telangana government news
శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై... కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందినట్లు సమాచారం.
ఈసీ
సాధారణంగా గడువు ముగిసే సమయం కంటే ముందే ఖాళీలను భర్తీ చేసేందుకు ఈసీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తుంది. అయితే కొవిడ్ రెండో దశ నేపథ్యంలో అప్పట్లో ఎన్నికలు నిర్వహించలేదు. ప్రస్తుతం కొవిడ్ ఉద్ధృతి తగ్గి అన్ని రకాల కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ విషయమై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందినట్లు సమాచారం.