తెలంగాణ

telangana

ETV Bharat / state

EC Focus on Social Media Campaign : సోషల్​ మీడియాలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారా ఈసీ ఓ కంట కనిపెడుతోంది జాగ్రత్త సుమీ - వాట్సాప్​ గ్రూప్​లో ఎలా ప్రచారం చేస్తున్నారు

EC Focus on Social Media Campaign in Telangana : ప్రస్తుత రోజుల్లో ఎలాంటి విషయమైనా వేగంగా చేరుకోవాలంటే దానికి ముఖ్య ఆయుధం సోషల్​ మీడియా. దీన్ని పలు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి తమదైన శైలిలో ఉపయోగించుకుంటున్నాయి. ఈ విషయంపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. ఎన్నికల నియమాలు దాటితే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్దం అవుతోంది.

EC Focus on Social Media Campaign
Political Parties Campaign Based on Social Media

By ETV Bharat Telangana Team

Published : Nov 1, 2023, 2:45 PM IST

EC Focus on Social Media Campaign in Telangana: ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్​ ఫోన్​ తప్పనిసరిగా ఉంటోంది. సోషల్​ మీడియాను ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో సామాజిక మాధ్యమాలకు డిమాండ్ ఎక్కువ అవుతోంది. ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ నెట్టింట ప్రచారంపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి. సాధారణంగా రాజకీయ నేతలు ప్రజల్లోకి తమ హామీలు చేరాలంటే.. మీడియా సమావేశం, బహిరంగ సభల ద్వారా చేరుస్తారు. కానీ తక్కువ సమయంలో ఎక్కువ మందికి ఈ సమాచారం చేరాలంటే ఇప్పుడు నేతల చేతిలో ఉన్న ఆయుధం సోషల్ మీడియా.

Political Leaders Campaign on Social Media: ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాలు ఏ రకంగా నిర్వహిస్తున్నారో.. సోషల్ మీడియా క్యాంపెయిన్ కూడా దానికి సమాంతరంగా నిర్వహిస్తున్నారు. నేటి తరం నేతలకు సామాజిక మాధ్యమం ఓ ఆయుధంగా మారింది. ఆయా పార్టీలకు ఓటు వేసే విధంగా రీల్స్​, పోస్టులు పెడుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.​ అయితే కొన్నిసార్లు ఈ ప్రచారం పరుధులు దాటుతోంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సోషల్​ మీడియాలో చేస్తున్న ప్రచారంపై కేంద్ర ఎన్నికల కమిషన్​ ప్రత్యేక దృష్టి పెట్టింది.

Telangana Assembly Elections 2023 : ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల వ్యయంపై నిఘా!

EC Enquiry on Social Media APPS : ప్రచారంలో భాగంగా అభ్యర్థులు సోషల్‌ మీడియా(Political Leaders Focus on Social Media)పై చేస్తున్న ఖర్చు వివరాలను ఈసీ ఆరా తీస్తోంది. ఆ ఖర్చును అభ్యర్థుల ఎన్నికల వ్యయం కింద లెక్కించాలని ఇప్పటికే అధికారులకు సూచించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆధ్వర్యంలో సోషల్‌ మీడియా బృందాలు ఏర్పాటయ్యాయి. ఈ బృందాలు ప్రకటనలు, ప్రచార ఖర్చు, ప్రచారం కోసం ముందస్తు అనుమతులు తదితర విషయాలను పరిశీలిస్తాయి.

సోషల్‌ మీడియాలో ప్రచార వేదికలు భారీగా పెరిగిపోవడంతో ప్రకటనలు, పెయిడ్‌ న్యూస్‌ను తెలుసుకునేందుకు నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) ప్రత్యేక టూల్స్‌ను వినియోగిస్తోంది. ఏయే సోషల్‌మీడియా ఖాతాల్లో ప్రకటనలు వైరల్‌ చేస్తున్నారు? అభ్యర్ధుల తరఫున ఇతర వ్యక్తిగత ఖాతాల ద్వారా ప్రచారం ఎలా జరుగుతుంది? ఇతర వివరాలను ప్రత్యేక సాంకేతిక నిపుణులు ఎన్​ఐసీ టూల్స్​ ద్వారా గమనించేలా ఏర్పాట్లు పూర్తి చేసింది.

EC Focus On Social Media in telangana : ఎన్నికల వేళ సోషల్ మీడియాపై పోలీసుల నిఘా.. గీత దాటితే తాట తీయడమే!

ఇంటర్నెట్​లో కుప్పలు తెప్పలుగా వెబ్​సైట్లు, సోషల్​ మీడియా ఖాతాలు, యూట్యూబ్​ ఛానెళ్లు చాలా పెరిగాయి. కొందరు అభ్యర్థులు పార్టీ తరఫున ప్రచారం, అనుకూల వార్తలు రాసేలా ఆయా వెబ్‌సైట్‌, ఛానెళ్ల నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకున్నారు. వీరంతా పార్టీలకు ప్రచారంతో పాటు ప్రకటనలు రూపొందించి వైరల్‌ చేస్తున్నారు. ఎన్‌ఐసీ వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ ఛానెళ్లు, ఎక్స్‌, థ్రెడ్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోని సంబంధిత సమాచారాన్ని తెలుసుకుని తద్వారా పెయిడ్‌న్యూస్‌తో పాటు ప్రచార ఖర్చును లెక్కించనుంది. ఈ సామాజిక మాధ్యం ద్వారా ఎన్నికల నియమాలు, మీడియా పర్యవేక్షణ నిబంధనలను ఎవరైనా అభ్యర్ధులు ఉల్లంఘిస్తే వారిపై చర్యలుతీసుకునేందుకు సిఫార్సులు చేయనుంది.

EC Focus on Money Laundering in Telangana 2023 : ఈసీ పంచముఖ వ్యూహం.. రంగంలోకి రిజర్వ్​ బ్యాంక్​.. డిజిటల్​ పేమెంట్స్​పై దృష్టి

EC Focus On Digital Payments : డిజిటల్‌ చెల్లింపులపై ఈసీ నజర్.. రూ. లక్ష దాటితే లెక్క చెప్పాల్సిందే

ABOUT THE AUTHOR

...view details