తెలంగాణ

telangana

ETV Bharat / state

EC Focus on Money Laundering in Telangana 2023 : ఈసీ పంచముఖ వ్యూహం.. రంగంలోకి రిజర్వ్​ బ్యాంక్​.. డిజిటల్​ పేమెంట్స్​పై దృష్టి

EC Focus on Money Laundering in Telangana Elections 2023 : రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను ఆర్థికంగా సమస్యాత్మకంగా పరిగణించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. గత రెండు మూడు రోజులుగా స్వాధీనం చేసుకుంటున్న మొత్తాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఎన్నికల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా అదనపు పరిశీలకులతో పాటు రిజర్వ్ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాను రంగంలోకి దింపారు. డిజిటల్​ పేమెంట్స్​పై కూడా దృష్టి పెట్టనున్నారు.

EC Focus on Money Laundering
EC Focus on Money Laundering in Telangana Elections

By ETV Bharat Telangana Team

Published : Oct 12, 2023, 7:01 AM IST

EC Focus on Money Laundering in Telangana Election ఈసీ పంచముఖ వ్యూహం.. రంగంలోకి రిజర్వ్​ బ్యాంక్​.. డిజిటల్​ పేమెంట్స్​పై దృష్టి

EC Focus on Money Laundering in Telangana Election 2023 :శాసనసభ ఎన్నికల షెడ్యూల్(Telangana Election Schedule) వెలువడడంతో రాష్ట్రంలో తనిఖీలు జోరుగా సాగుతున్నాయి. గత మూడు రోజులుగా నోట్ల కట్టలు, బంగారం స్వాధీనం చేసుకుంటున్నారు. ఇటీవలి హైదరాబాద్ పర్యటన సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం(CEC Focus on Telangana Election) హెచ్చరికలతో షెడ్యూల్​ వచ్చిన వెంటనే తనిఖీలను జోరుగా ప్రారంభించి కొనసాగిస్తున్నారు. గత మూడు రోజులుగా పట్టుబడిన డబ్బు, బంగారు, మద్యం విలువ పది కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా.

EC Focus on Telangana Assembly Election 2023 :2018 ఎన్నికల సమయంలో వంద కోట్ల రూపాయల వరకు డబ్బు, మద్యం, ఇతరత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రకారం రాష్ట్రంలో ఆర్థికంగా సమస్యాత్మకంగా ఉండే నియోజకవర్గాల సంఖ్య 35గా మొదట అంచనా వేశారు. అయితే గత మూడు రోజులుగా స్వాధీనం చేసుకుంటున్న మొత్తాన్ని చూసి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను ఆర్థికంగా సమస్యాత్మకంగా పరిగణించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రానున్న ఎన్నికల్లో డబ్బు విచ్చలవిడి వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఈసీ సిద్ధమైంది.

EC Transfers Several Collectors and SPs in Telangana : హైదరాబాద్ సీపీ సహా పలువురు కలెక్టర్లు, ఎస్పీల బదిలీకి ఈసీ ఆదేశం

Telangana Assembly Election 2023 : రాష్ట్రంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఈ మారు వ్యయ పరిశీలకుల సంఖ్యను కూడా పెంచనున్నారు. పరిశీలకులతో పాటు నిఘా వర్గాల నుంచి సమాచారం తీసుకోనున్నారు. కర్ణాటక, పశ్చిమ బంగాల్​ ఎన్నికల సందర్భంగా తీసుకున్న చర్యలు మంచి ఫలితాలు ఇవ్వడంతో ఇక్కడ కూడా అదే తరహా విధానం అమలు చేయాలని నిర్ణయించారు. డబ్బు కట్టడి కోసం పంచముఖ వ్యూహాన్ని అమలు చేసేందుకు వీలుగా రిజర్వు బ్యాంక్ సహకారం తీసుకుంటున్నారు.

EC Focus on Digital Payments of Telangana Leaders : అందులో భాగంగా ప్రతి రోజు ఐదు అంశాలపై దృష్టి పెట్టనున్నారు. ప్రతి బ్యాంకులో రోజువారీ విత్ డ్రాల ద్వారా మొత్తం, నగదు బదిలీ అవుతున్న ఖాతాలు, చెస్ట్ బ్యాంక్ నుంచి బ్యాంక్​లకు రోజువారీ వెళుతున్న మొత్తం, తదితరాల వివరాలపై ఈసీ దృష్టి సారించనుంది. ఆన్​లైన్, నగదు చెల్లింపు సంస్థల లావాదేవీల కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​ను ఉపయోగించనున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం తదితర డిజిటల్ చెల్లింపులపై నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా నిఘా ఉంటుంది. పోస్టాఫీసు ఖాతాల లావాదేవీలను పరిశీలించి రోజు వారీ నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. దాంతో రాష్ట్రంలో ఎలాంటి మనీ లాండరింగ్​, మద్యం సరఫరా, వస్తువుల పంపిణీని అరికట్టవచ్చని ఈసీ భావిస్తోంది. ఇందుకు తగిన అన్ని చర్యలను కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది.

How to Register to Vote Telangana : ఓటు హక్కే మీ వజ్రాయుధం.. ఈ హక్కును వదులుకోవద్దు

Cash Seized During Police Check in Hyderabad : ఎన్నికల కోడ్‌ అమలు.. 3 రోజుల్లోనే.. భారీ స్థాయిలో నగదు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details